రానాని ఇబ్బంది పెడుతున్న ఆ హీరో ఎవరు?

Google+ Pinterest LinkedIn Tumblr +

దగ్గుబాటి రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రానా సోలో హీరోగా హిట్ కొట్టి అదరగొట్టాడు. దర్శకుడు తేజ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కి తనలో ఇంకా సత్తా ఉందని చాటాడు. కాగా ఈ సినిమా పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా జనాలను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.

నేనే రాజు నేనే మంత్రి సినిమాకు సీక్వెల్ ఉందా..? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ సినిమా సీక్వెల్‌ అప్పట్లో తేజ కొన్ని హింట్లు ఇచ్చినా ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడు. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు భరత్-కిరణ్‌లు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. తేజతో కలిసి ఈ సినిమా సీక్వెల్ గురించి ఆలోచించామని.. అయితే ఇప్పుడున్న ప్రాజెక్టుల కారణంగా అది కుదరడం లేదని వారు చెప్పారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత మరియు ప్రొడ్యూసర్ సురేష్ బాబు, దర్శకుడు తేజ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఈ సినిమా సీక్వెల్ పట్టాలెక్కడం ఖాయం అని వారు అన్నారు.

మొత్తానికి ఈ సినిమాకు సీక్వెల్ ఉండటం ఖాయం అని తేలిపోయింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా సీక్వెల్‌లో ఈసారి రానా నటిస్తాడా లేక అతడి ప్లేస్‌లో వేరే హీరో ఎవరైనా నటిస్తాడా అనే ప్రశ్న ఇప్పుడు ప్రేక్షకుల్లో మొదలయ్యింది. మరి ఈ విషయంపై కూడా క్లారిటీ రావాలంటే ‘‘నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి’’ అనే పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పే హీరో ఎవరో చూడాలి. ప్రస్తుతం రానా ఈ సినిమా సీక్వెల్ పై తుది  నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నాడని సమాచారం.

Share.