మరోసారి మైలేజీ పెంచుతానంటున్న పాయల్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే తమ తలరాతలను మార్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరో సైతం అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో టాలీవుడ్‌కు కొత్త ట్రెండ్‌ను పరిచయం చేసి ఇప్పుడు వరుసబెట్టి సక్సెస్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్‌గా వచ్చిన RX100 సినిమా కూడా అదే కోవలోకి వచ్చి యూత్‌ను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో నటించిన యాక్టర్స్, ముఖ్యంగా హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్‌కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అమ్మడు ఈ సినిమాలో చూపించిన అందాలకు కుర్రాళ్లు పండగ చేసుకున్నారు.

ఈ సినిమాలో అంత బోల్డ్‌గా నటించింది కాబట్టే ఇప్పుడు ఈమె తన తరువాత చిత్రం ఎలాంటిది చేస్తుందా అని జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే మరోసారి కుర్రకారుకు అందాల విందు ఇచ్చేందుకు రెడీ అంటోంది ఈ బ్యూటీ. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు పాయల్ రాజ్‌పూత్ తన నెక్ట్స్ మూవీలో కూడా బోల్డ్ పాత్రలో నటించేందుకు సై అన్నది. భాను శంకర్ అనే దర్శకుడి డైరెక్షన్‌లో పాయల్ తన రెండో సినిమా సెప్టెంబర్ చివరి వరకు స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యిందట. ఇక బోల్డ్ పాత్రతో మరోసారి అందాల విందును ప్రేక్షకులు అందించే ఈ బ్యూటీ, తన మైలేజీని పెంచుకుంటూ పోతే త్వరలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయం అని అంటున్నారు సినీ విమర్శకులు.

 

Share.