కూతురి కోసం అలాంటి పని చేసిన చిరంజీవి.. దాని విలువ ఎంతంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానుల కోసం ఎంతో ఖర్చు చేసే చిరంజీవి కుటుంబ సభ్యులకు ఎలాంటి కష్టం రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తన చిన్న కూతురు కోసం అలాంటి పని చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసాడు. తాజాగా చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజకు ఒక ఖరీదైన ఇంటిని బహుమతిగా అందించారని సమాచారం. ముఖ్యంగా ఆ ఇంటి విలువ 35 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది.

శ్రీజ పై ఉన్న ప్రేమతోనే చిరంజీవి ఆ ఇంటిని గిఫ్టుగా ఇచ్చినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం తాను హీరోగా తెరకెక్కుతున్న సినిమాల నిర్మాతల ద్వారా వచ్చిన పారితోషకంతో చిరంజీవి శ్రీజకు ఈ ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఈ ఇంటిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, పిల్లల భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ముందే భావించిన చిరంజీవి శ్రీజ కోసం ఈ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.గతంలో కూడా తన భార్య సురేఖ కోరిక మేరకు చెల్లెళ్లకు స్థలాలను బహుమతిగా ఇచ్చిన చిరంజీవి.. ఇప్పుడు కూతురు కోసం ఖరీదైన కానుక ఇవ్వగా నాన్న ఇచ్చిన బహుమతిని చూసి శ్రీజ ఆనందానికి అవధులు లేవు . కొత్త ఏడాది ఏకంగా 35 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఈ అందివ్వడంతో ఆమె మరింత ఆనంద పడిపోతుంది.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న నేపథ్యంలో చిరంజీవి ఆదాయం పై ఆయన ఆధార పడాల్సిన అవసరం లేదు. 67 సంవత్సరాల వయసులో కూడా చిరంజీవి వరుసగా సినిమాల్లో నటిస్తూ ఇతర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో మెగా అభిమానులలో సంతోషం కలుగుతోంది .

Share.