నేను పెళ్లి చేసుకోకపోవటానికి ఆ నటుడే కారణం: టబు

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటి టబు మొన్నీమధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన జీవితానికి సంబంధించిన ఎవరికీ తెలియని అనేక షాకింగ్ నిజాలు తెలియ చేసారు టబు. తాను ఇంత కాలం పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కారణమని తెలిపారు. అజయ్ నాకు చిన్న నాటి నుండి మంచి స్నేహితుడని, నేను సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా నాకు ఎంతో సహాయం చేసాడని చెప్పారు. అజయ్ నా సోదరుడికి బంధువు ఆలా తాను మా ఫ్యామిలీ కి కూడా బాగా తెలుసునని తెలిపారు నటి టబు.

మేమిద్దరం 25 ఏళ్లు స్నేహితులుగా ఉన్నాం. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వెండితెర అరంగేట్రం చేసిన టబు అటు బాలీవుడ్‌లోను, ఇటు టాలీవుడ్‌లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. అయితే తాను పెళ్లి చేసుకోకపోవటానికి అజయ్ ఎందుకు కారణం అయ్యాడు అనేది మాత్రం వివరించలేదు. ప్రస్తుతం టబు ఈ సంవత్సరం తన 50 వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు.

Share.