సంజయ్ జీవిత కథని ఎంతకీ అమ్ముకున్నాడో తెలిస్తే షాకే..

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సంజు’. బాలీవుడ్ ఆగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ బయోపిక్ విడుదలైన అన్ని ప్రాంతాలలో మంచి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 250 కోట్లు వాసులు చేసింది. మొదట అనుకున్న దాని కంటే ఈ సినిమా భారీగా వాసులు చేయటంతో చిత్ర పంపిణీ దారులు మరియు నిర్మాతలు లాభాల బాట పట్టారు.
అయితే ఈ చిత్రం ఇంతటి ఘన విజయం సాధించటంతో హీరో సంజయ్ దత్ కూడా సంతోషంగా ఉన్నారని సమాచారం. దానికి ప్రధాన కారణం ఈ చిత్ర లాభాల్లో సంజయ్ కి కూడా వాటా ఉందట, సినిమా మొదలు అవ్వకముందే సంజయ్ బయోపిక్ రైట్స్ ద్వారా సుమారు 10 కోట్లు తీసుకున్నారని సమాచారం. అటు తర్వాత సినిమా హిట్ అయితే చిత్ర లాభాల్లో కూడా షేర్ ఇస్తామని నిర్మాత సంజయ్ దత్ కి హామీ ఇచ్చారని తెలుస్తుంది.ఇక ఇప్పుడు లాభాల్లో కూడా సుమారు 20 కోట్ల వరకు సంజయ్ దత్ అందుకోనున్నారని టాక్. అంటే మొత్తం కలిపి సంజయ్ తన బయోపిక్ ద్వారా సుమారు 30 కోట్ల వరకు అందుకున్నట్టే.

Share.