బోయపాటికి మెగా ఆఫర్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నాల్లో వేచిన ఉదయం అంటూ పాట పాడుకుంటూ ముందుకు సాగుతున్న బోయపాటికి ఎట్టకేలకు ఓ అండ దొరికొంది. దారి తెన్ను లేక ఎడారిలో ఒంటరిగా సాగిపోతున్న ఓ యాత్రికుడికి తోడు దొరికినట్లుగా ఇప్పుడు బోయపాటికి ఓ మెగా ఆఫర్ తలుపుతట్టింది. నమ్ముకున్న బాలయ్య కాదుపొమ్మన్నాడు… కానీ ఈ మెగా నిర్మాత అక్కున చేర్చుకున్నాడు… ఇప్పుడు ఎడారిలో ఓయాసిస్ దొరికినంత ఆనందంగా ఉన్నాడు బోయపాటి. ఇంతకు ఏవరా మెగా నిర్మాత, ఏంటా ఆఫర్ అనుకుంటున్నారా…?

బోయపాటి శ్రీనుకు సినిమా అవకాశాలు లేక ఐదారు నెలలుగా ఖాళీగానే కూర్చున్నాడు… ఎన్నో కథలు తయారు చేసుకున్న బోయపాటిని ఆదరించేవారు కరువయ్యారు. ఏమీ చేయాలో పాలుపోని బోయపాటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మెగా నిర్మాత, గీతా ఆర్ట్ ఆధినేత అల్లు అరవింద్ పిలిచి సినిమా ఇస్తానని చెప్పాడట. ఇంకేముంది ఎగిరి గంతేసినంత పనిచేశాడట బోయపాటి.

ఇంతకు అల్లు అరవింద్ నిర్మాతగా, బోయపాటి దర్శకత్వంలో వచ్చే సినిమా ఏంటీ… ఎలాంటి కథతో సినిమా తీస్తారు.. ఇంతకు ఇద్దరి సారధ్యంలో నటించే హీరో ఎవరు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే అల్లు అరవింద్ సినిమా నిర్మాతగా మారాడు అంటే అది పక్కా మెగా కుటుంబం నుంచి ఎవరో ఒక మెగా హీరోతోనే అయి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది… ఇప్పటికే మెగా హీరోతోనే బోయపాటి చేసిన సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరే మెగా హీరోతో తీస్తాడో… ఇప్పుడు ఎలాంటి కథతో వస్తాడో వేచిచూడాల్సిందే…

Share.