ఇస్మార్ట్ శంకర్ రివ్యూ

Google+ Pinterest LinkedIn Tumblr +

పూరీ జగన్నాథ్.. మాంచి మాసాలా దర్శకుడు.. ఇక హీరో రామ్.. మాస్ అండ్ క్లాస్ ను దంచికొట్టే యంగ్ హీరో.. సరైన హిట్టులేక చాలా కాలంగా పూరీ తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రామ్ కూడా సరైన హిట్ లేక టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఇందులో హీరో రామ్కు జోడిగా నభా నటేశ్, నిధి అగర్వాల్ నటించారు. అయితే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి మొదలు ట్రైలర్ దాకా సినిమాపై అంచనాలను భారీగానే పెంచేశాయి. ఇక ఎట్టకేలకు పూరీ హిట్ కొడతాడని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం విడుదల అయిన ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకుల అంచనాలను అందుకుందో సమీక్షలో చూద్దాం..

కథేమిటంటే…
దర్శకుడు పూరి మాత్రం ఈసారి కాస్త కొత్తకథనే ఎంచుకున్నాడు. ఒకరి మెమోరీని మరొకరి మెదడులోకి సర్జరీ ద్వారా చొప్పించడం.. అనే కొత్త కాన్సెప్ట్ ను తీసుకున్నాడు. సిబిఐ బృందం నటుడు సత్యదేవ్ మెమోరీని ఉస్తాద్ శంకర్(రామ్) అనే ఓ హైదరాబాద్ కుర్రాడి తలలోకి మారుస్తారు. ఇక ఇదే సమయంలో మెదడుకు సంబంధించి హీరోయిన్ నిధి అగర్వాల్ రీసెర్చ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మెదడులోని జ్ఞాపక కణాలకు సంబంధింది ఆమె బృందం పనిచేస్తుంది. అయితే.. అసలు రామ్ తలలోకి మరొకరి మెమోరీని ఎందుకు మార్చారు.. అసలు నిధి చేస్తున్న పరిశోధనకు..దానికి సంబంధం ఏమిటి..? ఇక్కడ నభానటేశాతో ఉన్న లింకేమిటో తెలుసుకోవాలంటే మాత్రం తెరపైనే చూడాలి.

ఎలా ఉందంటే…
దర్శకుడు పూరి కొత్త కాన్సెప్ట్ ను ఎంచుకున్నా.. దానిని అదే స్థాయిలో తెరపై చూపిండంలో కాస్త తడబాటుకు గురైనట్టుగానే అనిపిస్తుంది. మొదటి భాగమంతా సాదాసీదాగా నడుస్తుంది. రెండో భాగం మాత్రం కాస్త ఫరవాలేదని అనిపిస్తుంది. ఇక ట్విస్ట్ లు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. సినిమాలో వచ్చే మలుపులను ప్రేక్షకులు ముందే ఊహించేవిధంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సీన్లను ముందుగానే అంచనా వేయొచ్చు. మొత్తానికి.. ఈ సినిమాలో పూరి మార్క్ ఎక్కడో మిస్ అయిందన్న ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుంది. అయితే.. దర్శకుడు పూరి కథను నడిపించే విధానంలో ఇంకొంచెం జాగ్రత్తపడి ఉంటే మాత్రం ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేసేవారు.

ఎవరెలా చేశారంటే…
తన హీరోకు మాస్ లుక్ ఇవ్వడంలో మాత్రం ఎవరైనా దర్శకుడు పూరీ తర్వాతనే అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ లుక్ లో రామ్ అదరగొడతాడు. సినిమా మొత్తాన్ని హీరో రామ్ నటనే నడిపిస్తుంది. ఇక హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేశా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. సత్యదేవ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. మరో నటుడు షియాజీ షిండే తన నటనతో ఆకట్టుకున్నారు. రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్ అనే చెప్పొచ్చు. మణిశర్మ సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలుస్తుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మని శర్మ ప్రేక్షకులను అలరించారు.

సినిమా లో రామ్ నటన కొత్తగా ఉండడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది…నేపథ్య సంగీతం బాగుంది.
స్క్రీన్ ప్లే, కొత్తదనం లేని కథ ప్రేక్షకులని కొంత వరకు నిరుత్సాహ పరుస్తాయి

ఇస్మార్ట్ శంకర్ రేటింగ్ : 2.75 / 5

Share.