అర్జెంట్ గా తల్లిని కావాలనుకుంటున్న స్టార్ హీరోయిన్..

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన సమంత పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది. ఈ ఇయర్ ఆల్రెడీ మజిలీ, ఓ బేబీ సినిమాలు హిట్టు కొట్టడంతో అమ్మడికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం సమంత తమిళ సూపర్ హిట్ మూవీ 96 రీమేక్ లో నటిస్తుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మాత్రుక దర్శకుడు ప్రేం కుమారే తెలుగులో డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటుగా అమేజాన్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లో కూడా సమంత నటించబోతుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే సమంత అర్జెంట్ గా తల్లి కావాలని ఆరాటపడుతుందట. నాగ చైతన్యతో పెళ్లై రెండేళ్లు అవుతుంది. అందుకే ఇక పిల్లలను కనే ఆలోచనలో ఉందట సమంత. దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుందట. సాధారణంగనే పిల్లలంటే ఇష్టం అంటున్న సమంత తల్లి అయ్యేందుకు తొందపడుతుందట.

ఇప్పటివరకు ఓకే చెప్పిన సినిమాల వరకు పూర్తి చేసి ఇక మీదట సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చేసి తల్లి కావాలనే కలలు కంటుంది సమంత. మరి సమంత కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ప్రస్తుతం తను తల్లి అయ్యేందుకు ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

Share.