సూప‌ర్ హిట్లున్నా సూప‌ర్‌స్టార్‌కు డైరెక్ట‌ర్లు లేరు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్ర‌స్తుతం సినిమాల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రేక్ష‌కులు సినిమా చూసే విధానంలోనూ, వారి అభిరుచిల్లోనూ కొత్త కొత్త మార్పులు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే సినిమాలు హిట్ అవ్వాల‌న్నా, ప్రేక్ష‌కుల మ‌న‌స్సులు గెల‌వాల‌న్నా నేటి హీరోలు విపరీతంగా శ్రమించక త‌ప్ప‌ని ప‌రిస్తితి. ఇదిలా ఉంటే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప‌రిస్థితి ఇప్పుడు చాలా చిత్ర విచిత్రంగా ఉంది. భ‌ర‌త్అనే నేను, మ‌హ‌ర్షి లాంటి రెండు సూప‌ర్ హిట్ సినిమాల‌తో మంచి రేసులో ఉన్న మ‌హేష్ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం నాలుగు వ‌రుస హిట్ల‌తో సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం అనిల్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌ సరిలేరు నీకెవ్వరు సినిమా చేశాక ఏ సినిమా చేస్తాడ‌న్న‌ది మాత్రం క్లారిటీ లేదు. వ‌రుస హిట్లు ఓ వైపు… వ‌చ్చే సినిమాపై భారీ అంచ‌నాలు మ‌రో వైపు ఇలా మ‌నోడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నా ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ సినిమా చేసేందుకు స‌రైన డైరెక్ట‌ర్ అయితే లేని ప‌రిస్థితి.

రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, సుకుమార్‌, కొర‌టాల శివ‌, బోయ‌పాటి శీను ఇలా టాప్ డైరెక్ట‌ర్లు అంద‌రూ ఎవ‌రి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ సినిమా చేయాలంటే ఓ మోస్త‌రు డైరెక్ట‌ర్లే ఉన్నారు. పూరి లాంటి వాళ్ల‌తో సినిమా చేసేందుకు మ‌హేష్ ఓకే చెప్పే ప‌రిస్థితి లేదు. కొంద‌రు అగ్ర డైరెక్ట‌ర్లు మ‌హేష్‌తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నా వారి డిజాస్ట‌ర్ల దెబ్బ‌తో మ‌హేష్ వాళ్ల‌ను ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్థితి కూడా లేదు.

ఈ నేప‌థ్యంలో స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత మ‌హేష్‌కు క‌నీసం ఐదారు నెలల గ్యాప్ త‌ప్పేలా లేదు. మ‌రి ఈ బ్రేక్‌ తర్వాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటించబోతున్నాడ‌న్న‌ది మ‌త్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్సే. ఏదేమైన ఫుల్ స్వింగ్‌లో ఉన్నా కూడా మ‌హేష్‌కు డైరెక్ట‌ర్లు దొర‌క్క‌పోవ‌డం కాస్త షాకింగే.

Share.