మహేష్ బాబు సినిమా కథతో విజయ్ సక్సెస్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్నతనంలోనే తన తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మహేష్ బాబు.. ఈయన సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగే పండగ..మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ద్వారా ఇమేజ్ను సంపాదించుకున్నారు. మహేష్ బాబు ఓ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడు..

Vijay to play Mahesh Babu's role in Maharshi remake? | Tamil Movie News - Times of India
ఒకవేళ ఆ సినిమాని మహేష్ బాబు చేసి ఉంటే ఆ సినిమా తన హిట్ ఖాతాలో కూడా పడుండేది. ఇంతకు మహేష్ బాబు మిస్ అయిన ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.మహేష్ బాబుతో సినిమాలు చేయాలని చాలామంది దర్శకులు నిర్మాతలు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తమిళ్ దర్శకుడు మురగదాస్ కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో స్పైడర్ సినిమా వచ్చింది.

ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది కానీ అభిమానుల్ని మాత్రం నిరాశపరిచింది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా రిలీజ్ అయింది. ఇదంతా పక్కన పెడితే..మురగదాస్ మహేష్ బాబు కోసం తుపాకీ సినిమాను రాసుకున్నారట. అంతే కాకుండా మహేష్ బాబు ని దృష్టిలో పెట్టుకొని ఈ కథను ఎంపిక చేసుకొని మరి రాసాడట మురగదాస్..

అయితే అదే సమయంలో దళపతి విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ తో చొరవ ఉండటంతో ఈ సినిమాని నా కొడుకు చేయాలి అని కోరడంతో విజయ్ తో ఈ సినిమాని చేశారట. అలా మహేష్ బాబుకి తుపాకీ సినిమా మిస్ అయ్యింది.. అదే సినిమా విజయ్ చేసి మంచి హిట్ను తన ఖాతాలో వేసుకొని అటు తమిళ ప్రేక్షకులను ఇటు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ విషయం తెలిసి మహేష్ అభిమానులు లు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు.

Share.