నేను పవన్ కళ్యాణ్ ఓకే వ్యక్తిత్వమంటూ షాకింగ్ కామెంట్ చేసిన బాలయ్య..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వారసులకు ఎంతో ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ముఖ్యంగా బాలయ్యకు ఇప్పటికీ కూడా ఈ ఇమేజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ ఏజ్ లో కూడా బాలయ్య సంవత్సరానికి రెండు సినిమాలు చొప్పున నటిస్తున్నాడు. అంతేకాకుండా ఒకవైపు నటనలో మరోవైపు రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సినిమా పరంగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య ఇప్పుడు రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు.

Pawan Kalyan to shoot for Balakrishna's Unstoppable tomorrow

ఈ క్రమంలోనే హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నటువంటి బాలయ్య తాజాగా హిందూపురంలో పర్యటించారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు కుదుర్చుకున్న సంగతి మనకు తెలిసిందే జనసేన టిడిపి సమన్వయ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు బాలయ్య హిందూపురం వెళ్లారు.. ఇలా ఈ కార్యక్రమాల్లో భాగంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడటంతో ఆ విషయాలు ఇప్పుడు కాస్త వైరల్ గా అవుతున్నాయి.

ఇద్దరం ఏ విషయంలో అయినా కరెక్టుగా ఉంటాము అలాగే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం మాకు ఉంది అలాగే ఎవరికి భయపడము అవినీతి అరాచకాలను పాల్పడే వారిని లెక్క చేయకపోవడం వంటి లక్షణాలు పవన్ లోను నాలోను ఉన్నాయి అంటూ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. ఇలా బాలయ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా నందమూరి అలాగే మెగా హీరోలు ఇద్దరిని ఒకే చోట చూడటంతో అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో బాలయ్య హిందూపురంలో విజయం సాధించాడు.. ఇప్పుడు కూడా విజయం సాధించడం కోసమే బాలయ్య ఇప్పటినుంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం అవుతుంది.

బాలయ్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Share.