స్టార్ హీరోతో అవకాశాన్ని అందుకున్న పాయల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఆర్ఎక్స్ 100 సినిమాతో పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆ సినిమా ఆమె కెరీర్ ని ఒక మలుపు తిప్పుతుంది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఆమెకు ఫ్లాపులనే మిగిలించాయి. ఈ మధ్యనే ఈ అమ్మడు చేసిన మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అది తనకు మంచి సక్సెస్ ని అందిస్తోంది. అలా సినిమా సక్సెస్ లేదో వెంటనే పెద్ద సినిమాలో ఆఫర్లు ఆమెను చుట్టుముడుతున్నాయి.

ఇప్పటికే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో ఉన్న ఒకే కీలకమైన పాత్ర కోసం తనని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ పనులు మొత్తం కూడా బుచ్చిబాబు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలోకి ఒక్కొక్క ఆర్టిస్టులను బుచ్చిబాబు దగ్గరుండి ఎంచుకుంటున్నాడట. పాయల్ సినిమా మంగళవారం మంచి సక్సెస్ టాక్ తెచ్చి పెట్టడంతో రామ్ చరణ్ తీయబోతున్న సినిమాలో పాయల్ కి కూడా సమానమైన పాత్రను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Payal Rajput rejects Ram Charan film

ఇక ఈ పాత్రకి కొంచెం నెగటివ్ టచ్ ఉన్నట్టుగా కూడా సమాచారం.. అందుకే ఆ పాత్రకు పాయల్ అయితే బాగుంటుందని తనని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా పూర్తి అయ్యాక ఈ సినిమా మీద ఫోకస్ పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. డైరెక్టర్ శంకర్ భారతీయుడు-2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉండడం చేత రామ్ చరణ్ సినిమా కాస్త ఆలస్యం అవుతోంది. కానీ ఖాళీ సమయంలో బుచ్చిబాబు ఈ సినిమా కాస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా జనవరిలో సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.

ఒకవేళ ఈ సినిమా పాయల్ కెరీర్ ని రామ్ చరణ్ మార్చగలిగితే కచ్చితంగా ఈమెకు బడా సినిమాలలో అవకాశాలు వస్తాయని అభిమానుల సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన అఫీషియల్ గా చిత్ర బృందం ప్రకటిస్తే తప్ప ఈ అమ్మడు నటిస్తోందో లేదో చెప్పలేం..

Share.