నయనతార కి పోటీగా త్రిష.. ఎందుకంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్యూటీ త్రిష ఈమెకి వయస్సు పెరుగుతున్న కూడా సినిమా అవకాశాలు మాత్రం ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో నటిస్తూ తనకంటూ ఇమేజ్ను పెంచుకుంది. ఇది కాస్త పక్కన పెడితే తెలుగులో అవకాశాలు వచ్చిన ఏదొక కారణాలతో ఈ భామ రిజక్ట్ చేయడమో లేదంటే రెమ్యునరేషన్ కారణంగా ఆగిపోవడమో వంటివి చేస్తోందట. అలాగే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలను కూడా వదులుతుంది. అందుకేనేమో ఈమెతో చేయాలనుకున్న నిర్మాతలు కూడా ఈమె రెమ్యునరేషన్ చూసి సినిమాలను వదులుకుంటారు.

Trisha topples Nayanthara to become numero uno in Kollywood? - India Today

అయితే ఈ భామ ఇప్పుడిప్పుడు ఫామ్ లోకి వస్తోంది. ఈ మధ్యనే వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ఆమె రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. ఈమె కెరీర్ అయిపోయింది అనుకునే టైంలో ఈమెకు లక్ కలిసి వచ్చిందనే చెప్పాలి. వయస్సు పెరుగుతున్నా కూడా ఇంత అందంగా ఎలా ఉన్నావు అంటూ త్రిషని పొగడని వారు ఎవ్వరూ లేరు.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో కమలహాసన్, మణిరత్నం అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న విడా ముయార్చి కూడా హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పుడున్న డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని త్రిష ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. డిమాండ్ చేసింది అందుకే ఈ ముద్దుగుమ్మ మొదట్లో రెండు మూడు కోట్లు డిమాండ్ చేసింది.. కానీ ఇప్పుడు ఏకంగా 10 కోట్లకు టెండర్ వేసింది.దీంతో టాలీవుడ్ నిర్మాతలు అమ్మడికి ఛాన్స్ ఇచ్చేందుకు బయటపడుతున్నట్టు సమాచారం.

చిరు, బాలయ్య సినిమాల్లో అవకాశాలు రెమ్యునరేషన్ వల్లనే మిస్ అయినట్టు టాక్. ప్రస్తుతం త్రిష కి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతూనే గతంలో పెళ్లి వరకు వెళ్లి తన ఎంగేజ్మెంట్ ని కూడా రద్దు చేసుకుంది త్రిష.. ప్రస్తుతం కోలీవుడ్ లో 10 కోట్ల రూపాయలు నయనతార మాత్రమే తీసుకుంటోంది.ఏదేమైనా త్రిష రేంజ్ ఇప్పటికీ కూడా అలాగే ఉండటంతో ఆమె అభిమానులు చాలా సంతోషిస్తున్నారు

Share.