రష్మీ తో పెళ్లి పై అలాంటి కామెంట్స్ చేసిన సుధీర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

మొట్టమొదటిగా మెజీషియన్ గా తన కెరీర్ ని ప్రారంభించి.. ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగాడు.. ఇంతకు ఆయన ఎవరనుకున్నారు? ఆయనే బుల్లితెర మెగాస్టార్ సుడిగాలి సుధీర్.. ఈయన జబర్దస్త్ షోలో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి సక్సెస్ ను అందుకుని టీం లీడర్ గా ఎదిగాడు. మరోవైపు యాంకర్ రష్మీతో లవ్ , పెళ్లి అంటూ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఈ మధ్యనే గాలోడు మూవీతో మంచి సక్సెస్ ని సంపాదించుకున్నాడు.

Rashmi Gautam talks about Sudigali Sudheer marriage proposal & breakup
అయితే సుడిగాలి సుధీర్ , రష్మీ ఏ ముహూర్తన వీళ్లిద్దరూ కలిసి జబర్దస్త్ షోలో కనిపించారో అప్పటినుంచి ఈ జంటకు క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. అయితే చాలా మంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు.. వీళ్లిద్దరూ నిజంగా లవర్స్ యేనా? ఎప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు? ఇలా బోలెడన్ని ప్రశ్నలు అందరి మైండ్లో తిరుగుతున్నాయి. అయితే తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్ కి వచ్చిన సుడిగాలి సుధీర్ కి ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి.

సుధీర్ మాట్లాడుతూ.. ఎక్కడికెళ్లినా ఇలాంటి ప్రశ్నలు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. అంతగా జనం మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అందుకు ధన్యవాదాలు.. రష్మీ పై కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ మీదే.. ఇక పెళ్లి అంటారా.. అది నా చేతుల్లో లేదు.. ముఖ్యంగా చెప్పాలంటే నాకు పెళ్లిపై ఆసక్తి లేదు.. సినిమాల వైపే నాకు ఫోకస్ అంతా..

ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను.. ఒకవేళ దేవుడు నన్ను పెళ్లి వైపు మనసు మళ్లిస్తే అప్పుడు చూసుకుంటాను అని క్లారిటీ ఇచ్చాడు. దీన్నిబట్టి చూస్తే సుధీర్ ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. మరోవైపు రష్మితో సినిమా ఎప్పుడు తీస్తున్నారు అనే ప్రశ్న ఎదురుగా దానికి సమాధానం గా మా ఇద్దరికీ తగ్గట్టు కథ కోసం చూస్తున్నాము అంటూ సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు. సుధీర్ కొత్త సినిమా కాలింగ్ సహస్ర డిసెంబర్ 1న థియేటర్లో విడుదల కానుంది

Share.