రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ఝాన్సీ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెర పై సుమ తో పాటు యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఝాన్సీ కూడా ఒకరు.. ఈమె యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా పలు క్యారెక్టర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా వరుస సినిమాల్లో బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి యాంకర్ ఝాన్సీ ఇప్పటికి కూడా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు.

Anchor Jhansi: నన్ను ఎంతోమంది మోసం చేశారు.. వారిపై కక్ష - NTV Telugu

అయితే ఈమె కెరీర్ లో మంచి పొజిషన్లో సాగుతున్న టైం లో నటుడు జోగినాయుడుని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఝాన్సీ.. ఇలా పెళ్లి చేసుకోవడమే ఆమె చేసిన పెద్ద తప్పట ..చాలా మంది ఆమె అభిమానులు సైతం ఈ విషయాలను తెలుపుతున్నారు.ఎందుకంటే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం విడాకులు తీసుకొని విడిపోవడం అన్ని జరిగిపోయాయి. అయితే వీరిద్దరికీ అప్పటికే ఒక కుమార్తె కూడా జన్మించింది. ఇలా తన కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఝాన్సీ తాజాగా రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

తాను మొదటిసారి పెళ్లి చేసుకొని ఎన్నో ఇబ్బందులను కష్టాలను పడ్డానని రెండో పెళ్లి చేసుకొని ఆ ఇబ్బందులను ఎదుర్కోవటానికి తాను సిద్ధంగా లేనని ఆమె తెలియజేశారు. ఇప్పటికైతే తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏమాత్రం లేదని ఈమె వెల్లడించారు.. నా మనసు తత్వాన్ని అర్థం చేసుకొని తనంతట తానే ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైతే తప్పకుండా పెళ్లి గురించి ఆలోచిస్తానని ఝాన్సీ తెలిపారు. ఒక అమ్మాయి పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని తెలియజేస్తూ ఉన్నది.

అలాంటి పెళ్లి తనకు బలం కావాలి తప్ప బలహీనత కాకూడదని అలాగే తనను ఇబ్బందులు పెట్టే పెళ్లి మాత్రం తనకు అవసరం లేదూ అంటూ ఈ సందర్భంగా ఝాన్సీ కామెంట్ చేశారు. అయితే ఝాన్సీ చెప్పిన మాటల్లో తనను అర్థం చేసుకునే వారు దొరికితే రెండో పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉందని చెప్పకనే చెప్పింది.

Share.