గుంటూరు కారం నుంచి లీక్ అయిన వీడియో..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ తనయుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో మహేష్ బాబు.. టాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లో రిలీజ్ కానుంది. ఒకవైపు త్రివిక్రమ్ మరోవైపు మహేష్ బాబు అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

Bad Is Good For Guntur Kaaram!

మొదట్లో సినిమా కరెక్ట్ సమయానికి పూర్తి అవుతుందా,? లేదా? అన్న విషయంపై ఫ్యాన్స్ నుండి ఎన్నో అనుమానాలు వచ్చాయి. కానీ మహేష్ బాబు స్పీడ్ చూసి ఖచ్చితంగా అందుకూంటుందని.. ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఆయన అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉండగా గుంటూరు కారం సినిమా నుండి కొన్నాళ్ళుగా లీక్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే మహేష్ బాబుకి సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి మరొక వీడియో లీక్ అయ్యింది. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా దమ్ మసాలా సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ గా డాన్స్ స్టెప్స్ వేశాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతోంది. ఈ సాంగ్ కు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో కూడా మహేష్ బాబు మాస్ స్టెప్పులు ఎప్పుడు వెయ్యలేదు కానీ ఇప్పుడొచ్చిన గుంటూరు కారం సినిమాలో స్టెప్పులు మాత్రం మాస్ స్టెప్పులే..ఇక మహేష్ బాబు స్టెప్పులను చూసిన అభిమానులందరూ థియేటర్ లో దద్దరిల్లటం ఖాయం అని అంటున్నారు. మరి ఏదో ఒక లీక్ ఈ సినిమా నుండి వస్తూనే ఉండటంతో మేకర్స్ ను కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఇందులో జగపతిబాబు విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది 12న రిలీజ్ కానుంది.

Share.