గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌: ఆ ముగ్గురిని కాపీ కొట్టిన హ‌రీష్..

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గ‌ద్ద‌ల కొండ గణేష్ సినిమా ఎన్నో అవాంతరాల మధ్య ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. కెరీర్లోనే తొలిసారిగా మాస్ క్యారెక్టర్లో న‌టించిన వ‌రుణ్ ఇర‌గ‌దీసిన‌ట్టు సినిమా రిపోర్టులు చెబుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కోలీవుడ్‌లో హిట్ అయిన జిగ‌ర్తాండాకు రీమేక్‌గా తెరకెక్కించారు దర్శకుడు హరీష్ శంకర్. ఫస్టాఫ్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయకపోయినా సెకండాఫ్ లో మాత్రం తెలుగు నేటివిటీకి అనుగుణంగా అనేక మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటివరకు క్లాస్ యాంగిల్స్ లోనే కనిపించిన హీరో వరుణ్ తేజ్ సినిమాలో మాస్ గెటప్పులో అద‌ర‌గొట్టేశాడు. ఇక హరీష్ శంకర్ ఈ సినిమా కోసం తన గురువు రామ్‌గోపాల్ వ‌ర్మ ఫార్ములాతో ఆయన స్కూల్ డైరెక్టర్లను బాగా అనుకరించినట్టు స్పష్టంగా కనపడుతోంది. వ‌ర్మ నేచుర‌ల్ లొకేష‌న్లు ఎలా వాడ‌తాడో? ఇక్క‌డ హ‌రీష్ కూడా అచ్చం అదే స్టైల్ ఫాలో అయ్యాడు. ఇక కామెడీ విషయంలో మాత్రం శ్రీను వైట్ల‌ను ఫాలో అయినట్టు తెలుస్తోంది. శ్రీను వైట్ల దూకుడు, ఆగడు, బాద్‌షా సినిమాలో ఉన్న కామెడీ ఫార్మాట్‌ను ఇక్కడ యధావిధిగా దించేశాడు.

ఇక టేకింగ్ పరంగా వర్మ మ‌రో శిష్యుడు పూరిని ఫాలో అయిపోయాడు. వీటన్నిటికీ తోడు వ‌రుణ్‌తేజ్‌ భయంకరమైన నటన కూడా కలిపి గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌ను ఓ మెట్టు ఎక్కించేశాయి. ఇక క‌థ‌నంలో హ‌రీష్ త‌డ‌బ‌డ‌క‌పోయి ఉంటే ఈ సినిమా రేంజ్ ఖ‌చ్చితంగా మ‌రోలా ఉండేది. మొత్తంగా చూస్తే ఈ గద్దలకొండ గణేష్ సినిమాతో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అవడంతోపాటు థియేటర్ల‌కు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను ఖ‌చ్చితంగా సంతృప్తి ప‌రుస్తుంది.

Share.