కాజల్ తో పెండ్లికి క్యూ కడుతున్న పెండ్లి కొడుకులు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బెండకాయ ముదిరితే కూరకు పనికి రాదు అనేది ఒక సామేత… వయస్సు ముదిరితే సంసారానికి పనికిరారు అనేది నేటి నానుడి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.. అందం, అభినయం ఆమే సొంతం.. కానీ అందం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఈ చందమామ సినిమాల పైనే దృష్టి పెట్టింది కానీ, సంసారంపై మాత్రం ఆలోచించడం లేదు. అందుకే ఈ మిత్రవింద దేవికి నెటిజన్ల నుంచి పెండ్లి చేసుకుంటావా అని పోటీ పడి ప్రపోజల్స్ చేస్తున్నారు. ఇంతకు ఎవరీవిడ అనుకుంటున్నారా.. అదేనండీ టాలీవుడ్లో టాప్హీరోయిన్ కాజల్ అగర్వాల్.

ఈ మిత్రవింద దేవిని పెండ్లి చేసుకోవాలని పోటీ పడ్డారు రాజకుమారులు మగధీరలో.. అది రీల్ జీవితం.. కానీ ఇప్పుడు అదే మిత్రవిందను పెండ్లి చేసుకోవాలని ఉవ్వూళ్లూరుతున్నారు ఈ పెండ్లి కొడుకులు… ఈనాటి ఈ సీతకు మూడు పదులు వయస్సు దాటిపోతున్నా పెండ్లి కావడం లేదని పాపం అభిమానులు బెంగపెట్టుకున్నారట. అందుకే నేను నిన్ను పెండ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మరి మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఇటీవల ఒక అభిమాని ట్విట్టర్లో ఓ షాకింగ్ ట్విట్ చేశాడు కాజల్కి.

దీనికి కాజల్ అగర్వాల్ రిప్లయ్ ఇచ్చింది. ఈ కామెంట్ చూసిన అభిమానికి గుండె ఝల్లుమందట. కాజల్ ఓ పెండ్లి ప్రపోజల్ చేసిన అభిమానికి కోపంతో కాకుండా చిలిపిగా రిప్లైయ్ పంపింది. కొంచెం ప్రయత్నం చేయండి.. అంత సులభంగా జరగదు.. అంటూ ఆమే ట్విట్ చేసింది. అంటే ఆమే చేసిన ట్విట్లోనే సమాధానం ఎంత తెలివిగా ఇచ్చిందంటే.. మీకు పెండ్లి కోసం ప్రయత్నిస్తూనే ఉండండి.. కానీ నేను మాత్రం నీకు సొంతం కాను అని తెలివిగా రిప్లయ్ ఇవ్వడంతో నెటిజన్ సంతోషం వ్యక్తం చేసాడట.

Share.