యానిమల్ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

రనబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న యానిమల్ మూవీ యాక్షన్ సినిమాపై భారీ హైప్స్ ఏర్పడుతున్నాయి.. యాక్షన్స్ లవర్స్ ఇష్టపడే విధంగా గూస్ బంప్స్ వచ్చేలా ఈ సినిమా ట్రైలర్ ఉంది. ఈ సినిమా హిందీ వర్షన్ కు 48 మిలియన్ల న్యూస్ వచ్చాయి. అలాగే టాలీవుడ్ ట్రైలర్ కు మాత్రం కేవలం 6.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో కాదు టాలీవుడ్ లో రన్నింగ్ లో ఉంటున్న హీరో మహేష్ బాబు

Ranbir Kapoor replaces Mahesh Babu in director Sandeep Reddy Vanga's Devil?  - IBTimes India

గతంలో వేరు వేరు కారణాల వల్ల పుష్ప సినిమాను వదులుకున్నాడు మహేష్ బాబు.. ఇప్పుడు యానిమల్ సినిమాల సైతం వదులుకున్నారని తెలుస్తోంది. అయితే ఇలా మహేష్ బాబు వదులుకున్న సినిమాలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సినిమాని మహేష్ బాబు చేసి ఉంటే బాగుండేదని మరికొంతమంది ఈ సినిమా మహేష్ బాబు కి సూట్ కాదని ఫీల్ అయ్యే ఈ సినిమాకి నో చెప్పారని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

ఇదిలా ఉండగా ఈ మధ్యనే జక్కన్నతో కలిసి గుంటూరు కారం చేస్తున్న విషయం మనకు తెలిసిందే..అభిమానులకు దీనివల్ల ఆకలి తీరుతుందని ఫీల్ అవుతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో మహేష్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు..రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ సినిమా వస్తుందేమో వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు అభిమానులు.

మరోవైపు మహేష్ ,రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి వేరువేరు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు మహేష్ బాబు కానీ అటు జక్కన్న కానీ ఈ సినిమాపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు చక్కెరలు కొడుతున్నాయి. ఈ సినిమాతో జక్కన్న రికార్డులను బ్రేక్ చేస్తారేమో అని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు.

Share.