నిండా ముంచిన స్టార్ హీరో.. పాపం రకుల్!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ రంగంలో తమకున్న ఫేం ఉన్నప్పుడే స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తారు నటీనటులు. అయితే హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లు చాలా తొందరగా ఫేడ్ అవుట్ అవుతారు. వరుసగా హిట్స్ కొట్టిన పాపలు, రెండు మూడు ఫ్లాపులు పడ్డాయంటే ఇక అంతే.. మళ్లీ వాళ్ల ముఖం వెండితెరపై కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఏర్పడింది.

ఒకప్పుడు వరుసబెట్టి సక్సెస్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దుమ్ములేపిన రకుల్‌కు ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేతిలో లేకుండా పోయింది. అమ్మడు చేసిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడంతో నిర్మాతలతో పాటు హీరోలు కూడా రకుల్ పేరు చెబితే పారిపోతున్నారు. దీంతో తెలుగులో ఎలాగూ అవకాశాలు లేవని తమిళంలో రెండు మూడు సినిమాలు చేసి అక్కడ కూడా చేతులు కాల్చుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా అమ్మడు తయారయ్యింది. అయితే ఇటీవల ఒక తెలుగు స్టార్ హీరో రకుల్‌కు తన నెక్ట్స్ మూవీలో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడట.

దీంతో ఈమె ఆ హీరోను ఓ రేంజులో పొగిడేస్తూ వచ్చింది. జనాలు కూడా అమ్మడికి ఛాన్స్ ఇస్తున్న ఆ హీరో ఎవరా అంటూ తెలుసుకునే పనిలో పడ్డారు. ఆ హీరో పుణ్యమా అని మరోసారి తాను కెరీర్‌ను మల్చుకుంటానని ధీమా వ్యక్తం చేసిన రకుల్‌ను నిండా ముంచేశాడు మనోడు. ఇప్పుడు సదరు హీరో చేస్తున్న సినిమాలో హీరోయిన్ ప్లేసులో ఈమె పేరుకు బదులుగా వేరు పాప వచ్చి తిష్టేసిందట. దీంతో రకుల్‌ షాక్‌కు గురయ్యింది. తనకు సహాయం చేస్తానన్న హీరో ఇలా చేశాడేంటి అని ఆమె లోలోపల ఏడుస్తుందట. మొత్తానికి చూసినట్లయితే ఈ బ్యూటీ ఇక సామాను సర్దేసుకుందనే చెప్పాలి. పాపం రకుల్‌ను ఆదుకుందామా అంటే అమ్మడితో సినిమా చేస్తే తాము దుకాణం మూసేసుకోవాల్సి వస్తుందని ధైర్యం చేయడం లేదట హీరోలు, నిర్మాతలు. మరి ఇండస్ట్రీలో ఈ పాపను ఆదుకునే నాధుడే లేడా..?

 

Share.