సాయిధ‌ర‌మ్ తేజ్ `ప్ర‌తిరోజూ పండ‌గే` ఫస్ట్ వీక్ కలెక్షన్.. లాభాలతో డిస్ట్రిబ్యూటర్స్

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా మెన‌ల్లుడు, సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. చిత్ర‌ల‌హ‌రి డీసెంట్ హిట్ త‌ర్వాత వ‌చ్చిన ఈ సినిమా డిసెంబ‌ర్ 20న విడుద‌ల అయింది. చాలా రోజుల తర్వాత ఫామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తూ విజయపథంలో దూసుకుపోతున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’.

సత్యరాజ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా దూసుకుపోతోంది. విదేశాలలో సెటిల్ అయిన ఆయన కొడుకులు ఆయన చనిపోకముందే, కార్యక్రమాలు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. అయితే తాత కోసం.. కుటుంబాన్ని ఒకే చోట‌కు చేర్చేందుకు మనవడు పడే తాపత్రయమే ఈ చిత్ర కథ. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌డంతో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

దీంతో తొలి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది. ఇక ఆంధ్ర – తెలంగాణలో సుమారు 16 కోట్లకి, వరల్డ్ వైడ్ గా 18 కోట్లకి అమ్ముడు పోయిన ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యే లోపే వరల్డ్ వైడ్ 19.98 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటికే నైజాం, ఉత్తరాంధ్ర, కృష్ణా లాంటి ప్రాంతాల్లో లాభాలు స్టార్ట్ అయ్యాయి. ఇక మిగిలిన ఏరియాల్లో సెకండ్ వీకెండ్ పూర్తయ్యేలోపు అన్ని ఏరియాల్లో అందరి డిస్ట్రిబ్యూటర్స్ కి పండగ చేసుకునే లాభాలను తెచ్చిపెట్టనుంద‌ని అంత‌రూ భావిస్తున్నారు.

‘ప్రతిరోజూ పండగే’ ఫస్ట్ వీక్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:

నైజాం- 7.4 కోట్లు

సీడెడ్- 2.12 కోట్లు

గుంటూరు- 1.21 కోట్లు

ఉత్తరాంధ్ర- 2.57 కోట్లు

తూర్పు గోదావరి- 1.21 కోట్లు

పశ్చిమ గోదావరి- 92 లక్షలు

కృష్ణా- 1.22 కోట్లు

నెల్లూరు- 54.5 లక్షలు
————————————————–
ఫస్ట్ వీక్ మొత్తం షేర్ – 17.19 కోట్లు
————————————————–

కర్ణాటక + ఇండియా- 1.11 కోట్లు

ఓవర్సీస్- 1.68 కోట్లు
———————————————————-
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్- 19.98 కోట్లు

Share.