అబ్బాయ్ కోసం సినిమా వాయిదా వేసుకున్న బాలకృష్ణ…!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ సినిమా ఈ నెల 20 న విడుదలై భిన్నమైన టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ డైలాగులతో ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాను అందరూ సంక్రాంతికి విడుదల చేస్తారు అని భావించారు. కాని అనూహ్యంగా బాలకృష్ణ డిసెంబర్ 20 నే విడుదల చేసారు. సంక్రాంతికి గత మూడేళ్ళు గా బాలయ్య సినిమాలు విజయం సాధిస్తున్నా ఆయన మాత్రం అనూహ్యంగా త్వరగానే విడుదల చేసి ఆశ్చర్యపరిచారు.

అసలు దీనికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా ప్రస్తుతం మాత్రం ఒక వార్త టాలివుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. సంక్రాంతికి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎంత మంచి వాడవురా అనే సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మళ్ళీ ట్రాక్ లో పదాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు. ఇద్దరు నందమూరి హీరోల సినిమాలు ఒకసారే విడుదల అయితే బాలయ్య సినిమాకే ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. దీనిని ముందే గ్రహించిన బాలకృష్ణ కళ్యాణ్ రామ్ కోసం తన సినిమాను వాయిదా వేసుకున్నారు.

తాను కూడా సంక్రాంతికి విడుదల చేస్తే ఇబ్బంది అవుతుందని అప్పటికే నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయని కాబట్టి ముందే విడుదల చేస్తే ఏ గోలా ఉండదని భావించారట. భారీ మార్కెట్ ఉండే సంక్రాంతిని కాదని బాలకృష్ణ ముందే నిర్మాతను అబ్బాయి కోసం ఒప్పించి విడుదల చేసారు. దీనితో బాలయ్య అభిమానులు ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కుటుంబానికి బాలకృష్ణ విలువ ఇస్తారని అందుకే ఇలా విడుదల చేసారని అంటున్నారు. కాగా సంక్రాంతికి మరో మూడు సినిమాలు కూడా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

Share.