మెగాస్టార్ ఓకే అన్నారంటే చాలు – రాజమౌళి

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు “కళ్యాణ్ దేవ్” ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘విజేత’. ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మరియు ఒక పాట ని చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసింది. ఇందులో కళ్యాణ్ దేవ్ నటన, హావభావాలకి మెగా అభిమానుల నుండే కాక సగటు సినీ ప్రేక్షకుల నుండి కూడా చక్కటి స్పందన లభించింది. ఇక నిన్న ఈ సినిమా ఆడియో ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు, ముఖ్య అతిధిగా చిరంజీవి మరియు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి విచ్చేసారు.

అయితే ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ చిరంజీవిని ఉద్దేశించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చిరు మంచి యాక్టర్, డాన్సర్ ఇవి అందరికి తెలిసిన విషయాలే కానీ చిరంజీవి గారిలో ఎంతో మందికి తెలియని ఒక విషయం ఉంది అదే చిరుకు స్టోరీని జడ్జ్ చేయడంలో స్పెషల్ స్కిల్ ఉంది. స్టోరీ విన్నవెంటనే అందులోని మంచి చెడులు.. కావాల్సింది ఏమిటి.. లేనిది పర్ ఫెక్ట్ గా చెప్పేస్తారు.ఇది అతి కొద్ది మందిలో మాత్రమే నేను చూశానని రాజమౌళి ఈ సందర్భంగా తెలిపారు. చిరు సినిమా కథ ని ఒప్పుకుంటే చాలని ఇక ఆ సినిమా తప్పకుండ విజయం సాధిస్తుందని రాజమౌళి చెప్పారు. అయితే ఇప్పుడు విజేత సినిమా కథ ని కూడా మొదట చిరంజీవి గారే విని ఓకే చెప్పారని ఈ సినిమా కళ్యాణ్ దేవ్ కి మంచి హిట్ ఇస్తుందని, ఇందులో కోడి పాట నాకు బాగా నచ్చింది. నా వైఫ్ పాటలంటే ఇష్టపడదు. తనకు కూడా ఈ పాట బాగా నచ్చేసింది. నా ఫ్యామిలీ మొత్తం ఈ పాటను మెచ్చుకున్నారు’’ అని చెప్పారు మన దర్శక ధీరుడు జక్కన్న.వారాహి చలన చిత్రం బ్యానర్ పై వస్తున్న విజేత మూవీని రాకేష్ శశి డైరెక్ట్ చేశాడు.

Share.