వరుసగా అప్పులు తీరుస్తున్న మహేష్

Google+ Pinterest LinkedIn Tumblr +

సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు నాట ఆగ్ర కథానాయకులలో ఒకరు, అటువంటి సూపర్ స్టార్ కి అప్పులు ఏంటని అనుకుంటున్నారా అయితే ఇది చదవాల్సిందే. గతంలో మహేష్ బాబు సుమారు ముగ్గురు నలుగురు నిర్మాతలకి సినిమా చేస్తానని ఒప్పుకున్నారు అయితే కొన్ని అనుకోని కారణాల వలన ఇప్పటి వరకు సదరు ప్రొడ్యూసర్స్ తో సినిమా చేయలేదు మహేష్. అయితే అప్పుడు మహేష్ బాబు వారి నుండి కొంత నగదు రెమ్యూనరేషన్ కింద అడ్వాన్స్ గా తీసుకున్నారని సమాచారం. ఇక ఇప్పుడు వరుసగా సదరు నిర్మాతలతో సినిమాలు చేయటానికి మహేష్ సన్నాహాలు చేస్తున్నారని ఇండస్ట్రీ లో టాక్. ఇందులో భాగంగా ఇప్పటికే తన 25 వ సినిమాకి అశ్విని దత్ నిర్మాత గా వ్యవహరించనున్నారు, తదుపరి చిత్రాన్ని కె ఎస్ రామారావు కి అప్పగించాడు మహేష్. గతంలో కె ఎస్ రామారావు నుండి కొంత అడ్వాన్స్ తీసుకున్నారు మహేష్, అందులో కొంత అప్పుని ఇదే వరకే తీర్చగా మిగిలిన డబ్బుకి గాను కె ఎస్ రామ రావు తో సినిమా చేస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయే సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో నిర్మించనున్నారు. మరో వైపు కె రాఘవేంద్రరావు బ్యానర్ లో మహేష్ ఒక సినిమా చేయాల్సి ఉంది, ప్రస్తుతానికి ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందో ఎదురు చూడక తప్పదు.

Share.