ప్రభాస్ సినిమాలకు దూరమవుతాడా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో పాపులర్ అయిపోయాడు. ఇతర భాషల్లో కూడా అతని మార్కెట్ అమాంతంగా పెరిగిపోయింది. ఒకక్రకంగా చెప్పాలి అంటే బాలివుడ్ లో కూడా అతను పాపులర్ అయిపోయాడు. కాస్తో కూస్తో విదేశాల్లో కూడా మార్కెట్ పెంచుకున్నాడు. ఈ ఎపధ్యంలోనే అతనితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ప్రభాస్ సినిమా కోసం కథలు సిద్దం చేసుకుంటున్నారు.

అయితే ప్రభాస్ మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సాహో సినిమాకు దాదాపు రెండేళ్ళ సమయం తీసుకున్నాడు ప్రభాస్. ఆ సినిమా కోసం ఇతర సినిమాలను కూడా పక్కన పెట్టేసాడు. ఇక ఇప్పుడుమారో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఏడాది పైగా సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో మరో వార్త బయటకు వచ్చింది. ప్రభాస్ కి సినిమాల మీద ఆసక్తి తగ్గిపోయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. సినిమాలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపడం లేదట.

ఇటీవల ఒక దర్శకుడు వెళ్లి కథ వినిపించినా సరే ప్రభాస్ వద్దన్నాడని… ఈ సినిమా అయిన తర్వాత చూద్దామని చెప్పాడని టాలివుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరో రెండు మూడు సినిమాలు మినహా అతను పెద్దగా సినిమాలు చేసే అవకాశం లేదని అంటున్నారు. కమిట్ అయిన వారితో సినిమాను పూర్తి చేసేసి ఇక దాదాపుగా తప్పుకోవాలి అనే ఆలోచన చేస్తున్నాడట. ఎప్పుడైనా మంచి కథలు ఉంటే చెయ్యాలని లేకపోతే దూరంగా ఉండాలని భావిస్తున్నాడట ప్రభాస్. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

Share.