రేణు దేశాయ్ పెళ్లి పై స్పందించిన పవర్ స్టార్

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ నటి రేణూ దేశాయ్‌ నిశ్చితార్థం నిన్న పూణే లో ఘనంగా జరిగింది. అతి కొద్దీ మంది ఆత్మీయుల సమక్షంలో ఈ నిశ్చితార్ధ వేడుక జరిగిందని సమాచారం. రేణు తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎంగేజ్మెంట్ ఫోటోలని అభిమానులతో పంచుకున్నారు. అయితే వరుడు ఎవరన్న విషయం మాత్రం వెల్లడించలేదు. నిశ్చితార్థం వేడుక ఫోటోలలో కూడా ఎక్కడ వరుడు ఎవరని తెలియలేదు. అయితే ఈ రోజు ఉదయం జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా రేణు దేశాయ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
‘కొత్త జీవితం ప్రారంభించబోతున్న రేణూ దేశాయ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని ట్వీట్ చేసారు పవర్ స్టార్. గతంలో పవన్, రేణు హీరో హీరోయిన్లుగా బద్రి, జానీ సినిమాల్లో నటించిన విషయం అందరికి తెలిసిందే, అనంతరం వీరిద్దరూ 2009 లో వివాహం చేసుకోగా, కొన్నికారణాల వలన 2012 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్‌..ఆన్నా లెజ్నోవా అనే రష్యా యువతిని పెళ్లిచేసుకున్నారు.

Share.