ఎట్టకేలకు స్పందించిన మాల్యా, అప్పట్లో మోడీ, జైట్లీ కి లేఖలు రాశా

Google+ Pinterest LinkedIn Tumblr +

లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా ఎట్టకేలకు తన పై వస్తున్న ఆరోపణల పై నోరు విప్పాడు.
ప్రభూత్వ బ్యాంకుల వద్ద తాను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించటానికి, తన సంస్థ ఉద్యోగులకి జీతాలని ఇవ్వటానికి అన్ని ప్రయత్నాలు చేసానని, ప్రభుత్వం తో మరియు అరుణ్ జైట్లీ, మోడీ తో కూడా ఈ విషయం పై లేఖలు రాశానని…అటు ప్రభుత్వం కానీ బ్యాంకులు కాని నేను చేసిన వినతిని పట్టించుకోలేదు అన్నారు మాల్యా. పైగా తనను ఒక ఆర్థిక నేరస్తుడిగా చిత్రీకరించి చివరికి ఒక ” పోస్టర్‌ బాయ్‌ ” ని చేసారని ఈ పరిణామాలు నన్ను ఎంతో కలచి వేసాయి అన్నారు మాల్యా.

మాల్యా ఎస్ బీ ఐ దాని అనుబంధ బ్యాంకుల వద్ద 9 వేల కోట్లు తీసుకుని చెల్లించకుండా లండన్ పారిపోయిన విషయం తెలిసిందే, మాల్యాను భారత్ కు రప్పించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేసారు ఇక విసిగి పోయిన అధికారులు మాల్యా ని పారిపోయిన నేరస్థుడిగా ప్రకటించాలని ఈడీ డిమాండ్ చేసింది. అంతే కాకుండా మాల్యా కి సంబంధించిన సుమారు రూ.13 వేల కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తో కంగు తిన్న మాల్యా ఎట్టకేలకు నిన్న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. నేను తీసుకున్న బకాయిలను తిరిగి బ్యాంకులకు చెల్లిస్తానని, త్వరలోనే ఇండియా కి వస్తానని చెప్పారు. అయితే మాల్యా తాను ఎగ్గొట్టిన సొమ్ములపై మరోలా స్పందించారు తాను తీసుకున్న రుణం కంటే బ్యాంకులు, కేంద్రం లెక్కకు మించిన ఆస్తులని జప్తు చేశారని వాదించారు.

Share.