నిహారిక పెళ్లి డేట్ ఫిక్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా వారసురాలు నిహారిక హీరోయిన్ గా సుమంత్ అశ్విన్ మేల్ లీడ్ గా వస్తున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్. లక్ష్మణ్ కార్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. పెళ్లి ఫిక్స్ అయిన నాటి నుండి పెళ్లి రోజు వరకు రెండు కుటుంబాలు, రెండు మనసుల మధ్య జరిగే కథే హ్యాపీ వెడ్డింగ్ సినిమా.

ప్రస్తుతం ఏమాత్రం ఫాంలో లేని సుమంత్ అశ్విన్ మెగా డాటర్ నిహారికతో కలిసి చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ చేశాయి. ముద్దపప్పు ఆవకాయ వెబ్ సీరీస్ తో ప్రతిభ చాటిన లక్ష్మణ్ కార్య మొదటి ప్రయత్నంగా చేసిన ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. సుమంత్, నిహారికల జంట చూడముచ్చటగా ఉండగా సినిమా ఏమేరకు ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.

Share.