అమ్మడు మరో సమంత అవుతుందా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పెళ్లికి ముందు హీరోయిన్స్ క్రేజ్ ఎంత ఉన్నా పెళ్లి తర్వాత ఊహించని విధంగా కెరియర్ గ్రాఫ్ తగ్గిపోతుంది. అయితే సమంత మాత్రం పెళ్లికి ముందు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. పెళ్లి తర్వాత చేసిన రంగస్థలం, అభిమన్యుడు సినిమాలు హిట్ అవడంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది.

ఇక పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్ తమ కెరియర్ సక్సెస్ ఫుల్ గా సాగించవచ్చని సమంత బాటలో వెళ్తుంది ఆకాంక్ష సింగ్. సుమంత్ హీరోగా వచ్చిన మళ్లీ రావా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు నాని, నాగార్జునల మల్టీస్టారర్ సినిమాలో నాగ్ సరసన నటిస్తుంది. ఇవే కాకుండా మరో రెండు మూడు క్రేజీ ప్రాజెక్టులు అమ్మడి చేతిలో ఉన్నాయట.

సమంత తర్వాత పెళ్లి అయ్యాక కూడా వరుస అవకాశాలను అందుకుంటున్న వారిలో ఆకాంక్ష సింగ్ బాగా పాపులర్ అవుతుంది. చూస్తుంటే వీరిద్దరు తెలుగులో మరో కొత్త పంథా కొనసాగించేలా ఉన్నారు.

Share.