పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది కేతికశర్మ. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా లక్ష చిత్రంలో నాగసౌర్య సరసన నటించింది. డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కేతిక మాట్లాడుతూ రొమాంటిక్ సినిమాలో చేసిన పాత్ర కు, లక్ష సినిమాలో చేసిన పాత్రకు అసలు సంబంధమే లేదని.. అందుకే నేను ఈ సినిమా చేయడానికి అంగీకరించాను అని తెలిపింది.
రితిక పాత్రలో నేను ప్రేమించే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను అంటూ తెలిపింది. రొమాంటిక్ సినిమా లో కూడా ఒక పాట పాడాను.. ప్రస్తుతం లక్ష సినిమా వాళ్ళు కూడా నన్ను పాడమని చెప్పారు.. నా పాత్రకు చిన్మయ డబ్బింగ్ చెప్పారు.. త్వరలోనే నేను తెలుగులో కూడా డబ్బింగ్ చెబుతాను అని, స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అని.. నేను స్టేట్ లెవెల్ స్విమ్మర్, మా అమ్మ నేషనల్ లెవెల్ స్విమ్మర్, నాకు స్విమ్మింగ్ బేస్ మీద సినిమా వస్తే ఖచ్చితంగా చేస్తాను అంటూ మనసులో మాట బయట పెట్టింది.. నా కోరికను ఎవరు తీరుస్తారో అంటూ మీడియా ముందు వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.