తండ్రితో విభేదాలతో కుటుంబంతో సహా బయటికి వెళ్లిన సూర్య…!!

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి ఉమ్మడి కుటుంబం గా కలిసి ఉంటున్న వారిలో సూర్య కుటుంబం కూడా ఒకటి.తన తండ్రి శివకుమార్ తమ్ముడు కార్తీ కుటుంబాలతోని సూర్య ఇప్పటివరకు జీవిస్తూ ఉన్నారు. ఇక పెద్ద కోడలిగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది హీరోయిన్ జ్యోతిక. మరిదిని తోడికోడల్ని సైతం సొంత బిడ్డ లాగా చూసుకుంటూ ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శంగా నిలవడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ కుటుంబంలో కూడా పలు విభేదాలు వచ్చినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Hero Surya Family Photos - Lovely Telugu

ముఖ్యంగా తన తండ్రి శివకుమార్ సూర్య మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. దీంతో సూర్య కుటుంబం నుంచి విడిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఇకపోతే కుటుంబాన్ని వదిలి సూర్య తన భార్య బిడ్డలతో కలిసి ముంబైకి మఖం మార్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి.కానీ ఇందులో నిజం లేదనుకున్నారు అందరూ.. కానీ సూర్య ముంబైలో రూ .70 కోట్లు పెట్టి ఒక లగ్జరీ హౌస్ అని కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడంతో ఈ వార్తలు నిజమే అని నమ్మారు అభిమానులు.

tamil actor surya and jyothika family photos - YouTube

ముఖ్యంగా ప్రముకులు నివసించే జోహు ఏరియాలో ఈ ఇల్లు ఉందని.. పిల్లలకు పార్క్ జిమ్ గేటెడ్ కమ్యూనికేషన్ తో దాదాపుగా 9 చదరపు అడుగుల ఇల్లును సూర్య కొనుగోలు చేసినట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లో తన భార్య జ్యోతిక తో కలిసి ఆ ఇంట్లో గృహప్రవేశం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై సూర్య కుటుంబం సూర్యా ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Share.