హీరోకి తల్లిగా కంటే మహిళగానే గర్వంగా ఉంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా గత 40 ఏళ్లుగా తన జీవితంలో అనుభవించిన తీయని బాధను ఇటీవల హీరో సిద్దు జొన్నలగడ్డ తల్లి శారద జొన్నలగడ్డ మీడియాతో పంచుకున్నారు.. ఆలిండియా రేడియోలో వివిధ హోదాలలో వుండి.. చివరిగా అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా తన పదవి నుంచి విరమణ పొందారు శారదా జొన్నలగడ్డ.. ఇకపోతే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా రేడియో వారు జరిపిన వేడుకలకు శారదా జొన్నలగడ్డను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. శారద గారిని చూస్తే ఎవరికైనా నమస్కారం పెట్టకుండా ఉండలేని సంస్కారం తొణికిసలాడుతుంది.. ఆమె మాటలు, డిగ్నిటీ అన్ని విషయాల పైన శారద గారికి ఉన్న నాలెడ్జ్ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కానీ 40 ఏళ్ల పేరు, ప్రతిష్ట కేవలం రెండేళ్ల పాపులారిటీ ముందు అన్నీ చిన్నబోయాయి.

ఎందుకంటే ఆ రెండేళ్ల పాపులారిటీ ఆమె కొడుకుది. ఆమె అనుభవం ఈ సినిమా పాపులారిటీ ముందు ఎందుకు పనికి రాకుండా పోయింది.. ఆమెను శారదా గా కన్నా ఒక హీరో తల్లిగానే చూస్తున్నారు. అదే ఆమె ఆవేదన.. తన ప్రసంగంలో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడా కూడా తన కొడుకు గురించి చెప్పాల్సిన అవసరం వచ్చినా ఆమె మాట్లాడలేదు.. ఆత్మవిశ్వాసంతో తనకి చిన్నతనం నుంచి ఎంతో స్వేచ్ఛను ఇచ్చిన ఆమె తండ్రి గురించి మాట్లాడారు..తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన తండ్రితో పాటు తనకు ఎంతో సహాయ సహకారాలు అందించి ఇంతదాన్ని చేసిన తన భర్త గురించి కూడా ఆమె మాట్లాడారు.

ఇక ఆమె ప్రసంగం ముగిసిన తర్వాత అక్కడ ఆర్ జే మహిళలంతా కూడా డీజే టిల్లు పాటలకు స్టెప్పులు వేయడంతో ఆమె కళ్ళల్లో ఎంతో గర్వం కనిపించింది. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ తల్లిగా కాకుండా ఆమెను తన వృత్తిలో సాధించిన అనుభవాన్ని ప్రస్తావిస్తే ఆమె ఇంకా సంతోషపడి ఉండేవారు. అందుకే ఆమె ఒక తల్లిగా ఎంతో తీయని బాధను పడ్డా అది చివరకు ఆనందమే మిగిల్చింది.. అందుకే ఆమె చెబుతుంది ఒక హీరోకి తల్లిగా ఉండడం కంటే ఒక మహిళ అని అనిపించుకోవడమే నాకు గర్వంగా ఉంటుంది అని..

Share.