“గీత గోవిందం” ఫస్ట్ లుక్

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం “గీత గోవిందం”. కొన్నిరోజుల క్రితం విజయ్ మరియు రష్మిక వారి సరదా సంభాషణతో వైవిధ్యంగా ఈ సినిమాని ట్విట్టర్ ద్వారా ప్రమోట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ రోజు చిత్ర బృందం ‘గీత గోవిందం’ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక ని తన కాళ్ళ పై కూర్చోపెట్టుకుని రష్మిక వైపు నవ్వుతు కనిపించారు. సినిమా పోస్టర్ ని బట్టి ఇది పూర్తిగా ప్రేమ కథ చిత్రం అని తెలుస్తుంది.

“గీత గోవిందం” మూవీ ని ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మరియు అతని సన్నిహితుడు బన్నీ వాస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించగా, గోపి సుందర్ చక్కటి సంగీతాన్ని అందించారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్ గా పని చేసారు. ప్రస్త్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని జులై లేదా ఆగస్టు మొదటి వారం లో విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది.

Share.