టాలీవుడ్ లో టాప్ రిచెస్ట్ హీరో ఇతనే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఒక్కో సినిమాకు సుమారు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోలు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్ లో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు స్టార్ హీరోలు.. అయితే తాజాగా కొన్ని సర్వేల ప్రకారం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యంత ధనవంతుడైనటువంటి హీరోల వివరాలను బయట పెట్టడం జరిగింది.

Age is just a number, I still feel young at heart: Nagarjuna Akkineni |  Telugu Movie News - Times of India

మెన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం అత్యంత ధనవంతుడైనటువంటి హీరోల జాబితాలో మొట్టమొదటిగా ఉండేది నాగార్జుననే ..ఆ స్థానంలో నాగార్జున నిలవడం ఎంతో విశేషం.. సర్వే ప్రకారం తెలుస్తున్నది ఏంటంటే నాగార్జున ఆస్తులు విలువ కలిపి 3000 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం.ఇలా జాబితాలో టాప్ స్థాయిలో రిచ్ పర్సన్ గా నిలవడం అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే నాగార్జున తీసుకునేది ఒక్కొక్క సినిమాకు 15 కోట్లు మించి తీసుకుంటున్నారు. అంతేకాకుండా సినిమాలు కూడా అడపాదడపా చేస్తున్నాడు. ఈమధ్య సినిమాలు కూడా చాలావరకు తగ్గించారు. అలాంటి నాగార్జున అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానంలో నిలవడంతో ఆశ్చర్యపోతున్నారు.అయితే నాగార్జున ముఖ్యంగా హీరో మాత్రమే కాదు ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు అలాగే సీరియల్స్ నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.. ఇక ఆయన ఈ మధ్యనే బిగ్ బాస్ కార్యక్రమానికి అలాగే ఇతర కార్యక్రమాలను కూడా వ్యవహరిస్తున్నారు.

ఒకవైపు సినీ రంగం మరోవైపు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించాడు. అలాగే అన్నపూర్ణ స్టూడియో హైదరాబాదులో కొన్ని కన్వెన్షన్ సెంటర్స్ కూడా ఈయనవే అని తెలుస్తుంది. ఇలా అందరికంటే నాగార్జునకే ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం సౌత్ ఇండియాలో రిచ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో కింగ్ నాగార్జున

Share.