కోలీవుడ్ హీరో కార్తీ తన కెరీర్లోనే వైవిధ్యమైన హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే, సీజన్ ఏదైనా.. ఎంత గొప్ప హీరో సినిమా పోటీలో ఉన్నా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని కార్తీ ఖైదీ సినిమాతో మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. ఓ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, కంప్లీట్ నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేసిన ఈ ఖైదీ సినిమా తెలుగు, తమిళంలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
ఇక తెలుగులో ఊపిరి, ఖాకీ లాంటి సినిమాల తర్వాత వరుస డిజాస్టర్లు ఎదుర్కొన్న కార్తీకి ఈ సినిమా కొత్త ఊపిరిలూదింది. ఐదవ రోజు…. అది కూడా వీక్ డే అయిన మంగళవారం పెద్దగా డ్రాప్స్ లేకుండా అదే జోరుని కొనసాగించడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రు 4.5 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీక్‌లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి అందరికి లాభాలు తేనుంది.
ఏరియాల వారీగా ‘ఖైదీ’ ఐదు రోజుల కలెక్షన్స్ వివరాలు..
నైజాం – 1.58 కోట్లు
సీడెడ్ – 65.8 లక్షలు
గుంటూరు – 25.4 లక్షలు
ఉత్తరాంధ్ర – 44.4 లక్షలు
తూర్పు గోదావరి – 32.2 లక్షలు
పశ్చిమ గోదావరి – 22.4 లక్షలు
కృష్ణా – 32.7 లక్షలు
నెల్లూరు – 17.9 లక్షలు
—————————————-
5 డేస్ మొత్తం షేర్ – 3.98 కోట్లు
—————————————-