నాగచైతన్య -శోభిత విషయంపై నో ప్రాబ్లం అంటున్న చైతు…!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోలలో నాగచైతన్య కూడా ఒకరు. మొదట్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసి ఇప్పుడు అడపాదడపా సినిమాలను చేస్తున్నాడు. ఇక ఈయన పారతోషకం విషయానికొస్తే 10 నుండి 12 కోట్ల దాకా పుచ్చుకుంటున్నాడట.అయితే ఈ మధ్యనే నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ తో డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రిమ్మింగ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ భాగంగానే కొన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Naga Chaitanya responds to rumours about dating Sobhita Dhulipala |  Filmfare.com
ఇక ఈ మధ్య నాగచైతన్య , శోబితతో డేటింగ్ లో ఉన్న వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.. ఇది కాస్త పక్కన పెడితే నాగచైతన్య తండేల్ అనే సినిమాలో నటిస్తుండు 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.తన కెరీర్ గురించి చైతన్య మాట్లాడుతూ నటుడిగా ఇంకా చాలా పాత్రలు చేయాలని అన్నారు.ఇన్నేళ్ల కెరియర్లో నేను పరాపజయాలను చూశానని అలాగే స్టార్ హీరో అవ్వటానికి నేను ఎంతో కృషి చేస్తానని ఇంకా చెప్పాలంటే నేను నటుడిగా సంతృప్తి చెందలేదని ఇంకా నేను ఏదో సాధించాలి అంటూ ఆయన ఈ సందర్భంలో తెలియజేశాడు.

తన చేస్తున్న వెబ్ సిరీస్ దూత ఈ సినిమా సీజన్ 2 సీజన్ 3 కూడా ప్లాన్ చేస్తున్నామని అలాగే తండేల్ అనే సినిమాని పాకిస్తాన్లో షూటింగ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే శోభితతో తన రిలేషన్స్ గురించి రకరకాల కామెంట్స్ వచ్చాయి.. అందుకు నాగచైతన్య రానివ్వండి నో ప్రాబ్లం అంటూ నవ్వుతో కొట్టి పడేశాడు. అలాగే ఇలాంటి విషయాలు ఎలాంటి సమాధానాలు చెప్పినా ఆగవని వ్యక్తిగత జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పడంతో ప్రస్తుతం నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Share.