కాజల్ పంధ్రాగస్ట్ పండుగ…!

Google+ Pinterest LinkedIn Tumblr +

పంద్రాగస్టు వచ్చిందంటే భారతదేశానికి ఓ పండుగ వచ్చినంత సంబరంగా ఉంటుంది. పిల్లాపాపల నుంచి పెద్దల దాకా అందరు జాతీయ భావంతో దేశభక్తిని చూపి జాతీయ జెండాను ఎగురేసి పండుగ చేసుకుంటారు. ఇదే రోజున మన టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ కూడా పండుగ చేసుకోనున్నది. ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకోకండి… ఈ రోజున కాజల్ అగర్వాల్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి.

కాజల్ అగర్వాల్ తమిళ, తెలుగు భాషల్లో నటించిన రెండు సినిమాలు ఓకేరోజు విడుదల కానున్నాయి. దీంతో కాజల్ అగర్వాల్కు, ఆమే అభిమానులకు పండుగే పండుగ. ఇంతకు తెలుగులో కాజల్ నటించిన రణరంగం, తమిళంలో నటించిన కోమలి సినిమాలు ఒకేరోజున విడుదల చేస్తున్నారు.

తెలుగులో నటించిన రణరంగం సినిమాలో హీరోగా శర్వానంద్ నటిస్తున్నాడు. శర్వానంద్ ఈసినిమాలో ఓ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నాడు. ఈ చిత్రంకు సంబంధించిన టీజర్ ఇంతకు ముందే విడుదల అయింది. ఈసినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తమిళంతో జయం రవితో కలిసి కోమలి సినిమాలో నటిస్తోంది. సో కాజల్ అభిమానులకు పంద్రాగస్టు రోజున పండుగే పండుగ.

Share.