వివాహమైన నెలకే గుడ్ న్యూస్ చెప్పిన హన్సిక.. ఏమిటంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆపిల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ హన్సిక. తెలుగు, తమిళ్ వంటి భాషలలో కూడా అగ్ర హీరోయిన్ గా పేరు పొందింది.. చైల్డ్ యాక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హన్సిక ఆ తర్వాత తెలుగు,తమిళ్ వంటి భాషలలో పలు సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అలా తన బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కతూరియాను గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన వివాహం చేసుకుంది.

Hanshika Motwani wallpaper | 1920x1200 | 234074 | WallpaperUP

ఇక వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. దీంతో హన్సిక పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పి తన భర్తతో కలిసి వ్యాపారాలు చూసుకుంటోందని వార్తలు గత కొద్దిరోజులుగా వైరల్ గా మారాయి. ఈ వార్తలను పూర్తిగా ఆవాస్తవమని హాన్సిక కొట్టి వేసినట్లుగా తెలుస్తోంది. వివాహమైన తర్వాత సినిమాలు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తన భర్త కూడా తనకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నారని హన్సిక తెలియజేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Inside Hansika Motwani's pre-wedding Mata Ki Chowki with husband-to-be. See  pics | Bollywood - Hindustan Times

ఇకపోతే తాజాగా వస్తున్న కథనాలు ప్రకారం హన్సిక త్వరలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ తో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలుపడబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వివాహమైన నెలకే ఈమె తన కొత్త సినిమాలు ప్రకటించే విధంగా ప్లాన్ చేయడంతో అభిమానులు కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సినిమాలలో మరొకవైపు తన భర్తతో కలిసి వ్యాపారాలను చూసుకుంటూ తన కెరియర్ ని ముందుకు తీసుకువెళ్తోంది హన్సిక.

Share.