బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలు ఎక్కువగా కనిపించేది యాంకర్ శ్రీముఖినే అని చెప్పవచ్చు. ఎలాంటి విరామం లేకుండా వరుస షూటింగ్ లతో ఎప్పుడు బిజీగా ఉంటుంది ఈ బుల్లితెర ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఒకే ఛానల్ లోనే కాకుండా ఇతర చానల్స్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదనతో టాప్ యాంకర్లలో ఒకరిగా నిలుస్తోంది శ్రీముఖి. ఇక తన కెరీర్ విషయంలో ఎంతో సక్సెస్ అయిన ఇప్పటివరకు బిజీగా ఉన్న హీరోయిన్గా పలు చిత్రాలలో నటించిన సక్సెస్ కాలేక పోయింది.
కేవలం బుల్లితెర పైన మాత్రమే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని శ్రీముఖి. అయితే ఇప్పుడు తాజాగా శ్రీముఖి ఒక ప్రముఖ వ్యాపారవేత్త ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బిజినెస్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఈమె ప్రేమలో ఉందని వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. త్వరలోనే వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇరువురు కుటుంబ సభ్యులకు తెలపడంతో కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పడంతో త్వరలోనే వీరి పెళ్లి పనులు జరగబోతున్నట్లు సమాచారం.
అయితే శ్రీముఖి పెళ్లి గురించి వార్త గడిచిన వారం నుంచి వైరల్ గా మారుతోంది. అయితే ఆ వ్యాపారవేత్త ఎవరు అనే విషయంపై అభిమానులు ఆరా తీస్తున్నారు.ఇదివరకు కూడా ఎన్నోసార్లు శ్రీముఖి వివాహం పైన పలు వార్తలు వినిపించాయి. మరి ఈసారైనా శ్రీముఖి వివాహం నిజంగానే చేసుకుంటుందా లేదా అనే అనుమానాలను కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో కూడా శ్రీముఖి ఒక టాప్ యాంకర్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. గడిచిన ఏడాది క్రితం కూడా శ్రీముఖి తన బాయ్ ఫ్రెండును పరిచయం చేస్తానని సోషల్ మీడియాలో తెలియజేసింది. మరి ఈ పెళ్లి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.