పవన్ కళ్యాణ్ ను కలిసిన అకిరా నందన్…కారణం అదే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకిరా నందన్ చాల రోజుల తరువాత ఇవాళ విజయవాడ లో మీడియా కంట పడ్డారు. పవన్ మూడో వివాహం చేసుకున్నప్పటి నుండి రేణు దేశాయ్ మరియు వారి కొడుకు అకిరా తో దూరంగా ఉంటూ వస్తున్నారు. అడపా దడపా కలిసిన సందర్భాలు కూడా చాల తక్కువనే చెప్పాలి.రేణూదేశాయ్ తో విడిపోయిన తర్వాత అన్నా లెజ్నోవాను పెళ్లి చేసుకున్నాడు పవన్. అయితే కొన్ని సంవత్సరాల తరువాత ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ తన కొడుకు అకిరా తో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు. కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ తన అఫిషియల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అకిరా ఫోటో పెట్టి “తమ కుమారుడు అకీరా నందన్ ను జూనియర్ పవర్ స్టార్ అని పిలవద్దంటూ” పెట్టిన పోస్ట్ మీడియా లో వైరల్ గా మారింది. తన కొడుకుకు సొంత ఐడెంటిటీ ఉండాలన్నది ఆమె కోరిక అని తెలిసింది.

ఇది జరిగిన మూడు రోజులకే అకిరా తన తండ్రి పవన్ కళ్యాణ్ ను కలవటం అందరిని ఆశ్చర్య పరిచింది. అయితే గత కొంత కాలంగా పవన్ కంటి ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. గతంలో రంగస్థలం మూవీ సక్సెస్ ఈవెంట్ సందర్భంగా కళ్లజోడు పెట్టుకున్న సమయంలో ఈ విషయం చెప్పాడు, అప్పటి నుండి చాల ఈవెంట్స్ లో కళ్ళజోడు పెట్టుకునే దర్శనమిచ్చారు. ఇప్పుడు పవన్ కంటికి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట.
ఇది తెలుసుకున్న అకిరా తండ్రికి సర్జరీ పూర్తి అయ్యే వరకు హాస్పిటల్ లోనే ఉండాలని నిర్ణయించుకుని వెంటనే పూణే నుండి విజయవాడ వచ్చాడని సమాచారం. అలా వీరిద్దరూ విజయవాడ లో కలిసినప్పటిదే ఈ ఫోటో. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

Share.