‘డిస్కో రాజా’ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద బోల్తా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

‘డిస్కో రాజా’ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. రవితేజ ఎంత కలెక్ట్ చేసాడంటే..?
మాస్‌ మహారాజా రవితేజ ఖాతాలో `రాజా ది గ్రేట్` చిత్రం తరువాత స‌రైనా హిట్ ప‌డి చాలా కాలం అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడో లేక వచ్చిందో తెలియదు గానీ గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. మ‌ళ్లీ ఇప్పుడు విభిన్న‌మైన క‌థ‌తో `డిస్కో రాజా` అంటూ ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చాడు ర‌వి తేజ‌. అయితే మాస్ రాజా నిలదొక్కుకోవాలి అంటే ఈ సినిమాతో తప్పనిసరిగా సక్సెస్ అందుకోవాలి. ఓ విధంగా ఆయన కెరీర్ డేంజర్ జోన్ లో ఉందనే చెప్పాలి.

ఇక ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి వినూత్నమైన ప్రయోగాలతో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో వచ్చిన డిస్కో రాజా జ‌న‌వ‌రి 24(నిన్న‌)న విడుద‌ల అయింది. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేసాడు. ర‌వితేజ స‌ర‌స‌న ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తన్యా హోప్ హీరోయిన్లుగా న‌టించారు. అయితే డిస్కో రాజా సినిమా ప్రేక్షకుల నుంచి మిక్డ్స్‌ టాక్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ సినిమా యావరేజ్ అనిపించుకున్నా, రవితేజ చేసిన డిస్కో రాజా పాత్రకి మాత్రం థియేటర్స్ లో ఈలలు పడ్డాయి.

మ‌రో విష‌యం ఏంటంటే సైన్ ఫిక్షన్ చెప్పబోతున్నారు అని చూపించి, రెగ్యులర్ రివెంజ్ డ్రామా చెప్పడంతో సినిమా కాస్త నిరాశపరిచింద‌ని చెప్పాలి. ఇక మామూలుగా రవితేజ సినిమా అంటేనే కథ మొత్తం అతడి చుట్టే తిరుగుతుంది.. ఆయన సినిమాకు ఆయనే ప్రధాన బలం, బలగం. ఇక ఈ సినిమాలో కూడా వన్‌ మ్యాన్‌ షో అనడం సాధారణమే అవుతుంది. క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. డిస్కో రాజాకి ఫస్ట్ డే కలెక్షన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2.58 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఒక రకంగా చూసుకుంటే రవితేజ కెరీర్‌లోనే అత్యంత తక్కువ వసూలు చేసినట్టు తెలుస్తోంది.

‘డిస్కో రాజా’ ఆంధ్ర – తెలంగాణ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం – 1.1 కోట్లు

సీడెడ్ – 36.6 లక్షలు

గుంటూరు – 17.2 లక్షలు

ఉత్తరాంధ్ర – 31 లక్షలు

తూర్పు గోదావరి – 20.3 లక్షలు

పశ్చిమ గోదావరి – 15.4 లక్షలు

కృష్ణా – 18 లక్షలు

నెల్లూరు – 10.2 లక్షలు
——————————————————
మొదటి రోజు మొత్తం షేర్ – 2.58 కోట్లు
——————————————————

Share.