మార్చిలో సెట్స్‌పైకి నాగార్జున ‘బంగార్రాజు’..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సీనియర్ హీరోల్లో ఇప్పటికీ మన్మథుడు లుక్‌ మెయిన్‌టైన్‌ చేస్తున్న ఏకైక హీరో నాగార్జున. అయితే మనం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాగార్జున నటించిన మూవీ సోగ్గాడే చిన్నినాయన. నాగార్జున ద్విపాత్రాభినయంగా క‌నిపించిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే ఈ డికేడ్ లో నాగ్ కెరీర్ లోనే ఈ సినిమా ముఖ్యమైంది. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో ఆయన పోషించిన ‘బంగార్రాజు’ క్యారెక్టర్‌కు ప్రేక్షకులు ఇప్పటికిీ మరిచిపోయారు.

అందువలన అదే టైటిల్‌తో.. ఇపుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాను తెరకెక్కించబోతున్నాడు. తాతా మ‌న‌వ‌ళ్ల క‌థ‌గా దీన్ని తెర‌పైకి తీసుకురాబోతున్న‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. తాత‌గా నాగార్జున, మ‌న‌వ‌డిగా నాగ‌చైత‌న్య న‌టిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సోదరుడు మరణం కారణంగా అలాగే నాగ్ పర్సనల్ పనులతో బిజీగా ఉండటం కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది.

ఇక మార్చి మూడో వారంలో సినిమాను మొదలుపెట్టి, వ‌చ్చే ఏడాదే వేస‌విలో బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మ‌రి ఈ సారైన అనుకున్న స‌మ‌యానికి ప‌ట్టాలెక్కుతుందో లేదో..? చూడాలి. కాగా బంగార్రాజు స్క్రిప్ట్ పనులు కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయట. ఈ చిత్రాన్ని నాగార్జున తన సొంతబేనర్ అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మించబోతున్నారు. మనం తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న మూవీ ఇది. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్‌ లో బిజీగా ఉన్నాడట. ఇక ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది.

Share.