‘ఎంత మంచివాడవురా’ క్లోసింగ్ కలెక్షన్స్.. ఏంటిది క‌ళ్యాణ్ రామ్‌..?

Google+ Pinterest LinkedIn Tumblr +

గతేడాది ’118’ తో మంచి హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్, శతమానం భవతి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌తో అలరించిన దర్శకుడు సతీష్ వేగేశ్న కంబోలో వచ్చిన కుటుంబ కథా చిత్రం `ఎంత మంచివాడవురా`. సంక్రాంతికి భారీ చిత్రాలు రేసులో ఉన్నా ధీమాగా ఈ చిత్రాన్ని బరిలో నిలిపారు. ఈ చిత్రంలో కళ్యాఱ్ రామ్‌కు జోడిగా మెహ్రీన్ నటిస్తుంది. ఇప్పటి వరకు మాస్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్..సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తొలిసారి ఫ్యామిలీ ఎంటర్టేనర్ మూవీ చేసాడు.

ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. నటన, డైలాగ్స్, డాన్స్ పరంగా ఆకట్టుకున్నాడు. మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. అయితే ఎమోషన్స్ సప్లై.. వినడానికి కొత్తగా ఉన్న ఈ పాయింట్‌‌తోనే ‘ఎంత మంచివాడవురా’ అనే కథను అల్లుకున్నారు దర్శకుడు వేగేశ్న సతీష్. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. ఈ ఎమోషన్స్ సప్లై‌ని కన్వెన్సింగ్‌గా బ్యాలెన్స్ చేయడంలో తాను కన్ఫ్యూజ్ కావడమే కాకుండా ప్రేక్షకుల ఎమోషన్స్‌తో ఆడుకున్నారు దర్శకుడు సతీష్ వేగేశ్న.

అయితే సంక్రాంతి రోజు రిలీజ్ కావడం వలన మొదటి రెండు రోజులు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత బాగా డ్రాప్ అయ్యి విడుదలైన 12 రోజుల్లోనే థియేటర్స్ నుంచి కంప్లీట్ గా తీసేయబడింది. ఆంధ్ర – తెలంగాణలో 12 కోట్లు కలెక్ట్ చేయాల్సిన ఈ సినిమా క్లోజింగ్ టైంకి కేవలం 6.38 కోట్లు షేర్ సాధించింది. దీంతో ఇటు క‌ళ్యాణ్ రామ్‌కు ఓ ఫ్లాప్ ఖాతాలో ప‌డ‌గా.. అటు డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా న‌ష్టాలు తెచ్చిపెట్టిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.

‘ఎంత మంచివాడవురా’ ఆంధ్ర – తెలంగాణ క్లోజింగ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం – 1.5 కోట్లు

సీడెడ్ – 83 లక్షలు

గుంటూరు – 65 లక్షలు

ఉత్తరాంధ్ర – 82 లక్షలు

తూర్పు గోదావరి – 95 లక్షలు

పశ్చిమ గోదావరి – 62 లక్షలు

కృష్ణా – 58 లక్షలు

నెల్లూరు – 23 లక్షలు
———————————————
మొత్తం షేర్ – 6.18 కోట్లు
——————————————–

రెస్ట్ అఫ్ ఇండియా + ఓవర్సీస్ – 20 లక్షలు

వరల్డ్ వైడ్ క్లోజింగ్ షేర్ – 6.38 కోట్లు

Share.