ఆ సినిమా మహేష్ కెరియర్ను చాలా దెబ్బేసిందా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తర్వాత తన తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్న సంగతి మనకు తెలిసిందే.. అయితే తన తండ్రి సహకారంతో రాజకుమారుడు చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకు వచ్చారు ప్రిన్స్ మహేష్.. ఒక చిత్రాన్ని మహేష్ బాబుతో తీయాలనుకున్నారట .కానీ అది కామెడీ సినిమా కావటంతో మహేష్ బాబుకి ఈ సినిమా సెట్ కాదని కృష్ణ రిజెక్ట్ చేశాడట.

Mahesh Babu's 'Brahmotsavam' to release on May 20 | India Forums

ఇక మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో హిట్లు ఫ్లాపులు ఉన్నప్పటికీ ఆ ఒక్క సినిమా మాత్రం మహేష్ బాబు కెరీర్ ని పెద్ద దెబ్బ కొట్టింది.  ఇంతకు ఆ సినిమా ఏంటి అనుకున్నారా ఆ సినిమానే బ్రహ్మోత్సవం.. ఈ సినిమా కంటే ముందే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా తెర ముందుకు వచ్చింది.. అయితే ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత బ్రహ్మోత్సవం సినిమా చేశారు మహేష్ బాబు కానీ తీరా ఈ సినిమా థియేటర్లో విడుదలయ్యాక పెద్ద డిజార్డర్ గా మిగిలింది. దాంతో చాలామంది మహేష్ బాబు అంటే పడని ఇతర హీరోల అభిమానులు మహేష్ బాబుని ఓ రేంజ్ లో ఏకిపారేశారు. ఇక ఈ రిజల్ట్ చూసిన మహేష్ బాబు చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 

అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు ఆ సమయంలో ఈ సినిమా గురించి కొన్ని విషయాలను మాట్లాడుతూ నా కర్మ కాళి ఆ సినిమా చేశాను అంతా నా కర్మ.. అసలు బ్రహ్మోత్సవం సినిమా చేయకుండా ఉంటే బాగుండేది. అంటూ అసహనం వ్యక్తం చేశాడట..ఇక అప్పటి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఇప్పుడు తీస్తున్న గుంటూరు కారం సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Share.