ఈ తరం హీరోలలో ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైన పనేంటో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాటితరం నుంచి నేటి వరకు డ్యూయల్ లేదా ట్రిపుల్ పాత్రలలో నటించడం సర్వసాధారణమే. అయితే ఇలా హీరోలు ఒకే సినిమాలో బహుముఖ పాత్రలో నటించడం అనేది ఒకప్పుడు చాలా పెద్ద విషయం..అంతేకాదు వింతైన విషయం కూడా .. ఎన్టీఆర్ లాంటి సీనియర్ నటుడు దానవీరశూరకర్ణ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో నటించాడు. అలా నటించడం వల్ల సినిమాను ఎక్కువగా జనాల్లో ప్రమోషన్ చేసుకోవచ్చనే కారణంతో అలాగే ఎక్కువగా సదరు హీరో సినిమాలో కనిపించడం వల్ల అభిమానులు బాగా థ్రిల్ ఫీల్ అవుతారని అనుకునేవారు.

అయితే ఇలా నటించడం రాను రాను తగ్గుతూ వస్తోంది. లోక నాయకుడు కమలహాసన్ మాత్రమే విచిత్ర సహోదరులు సినిమాలో ట్రిపుల్ రోల్ అలాగే దశావతారం సినిమాలో పది పాత్రల్లో నటించారు. ఇలా చేయడం మరో నటుడికి సాధ్యం కాదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటికి మించి ఎక్కువ పాత్రలలో హీరోలు నటిస్తే ఆర్టిఫిషియల్ గా ఫీల్ అవుతున్నారు. కేవలం అవసరాన్ని బట్టి డ్యూయల్ పాత్రలకు ఓకే చెబుతున్నారు. కానీ ట్రిపుల్ పాత్రలు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.

మూడు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలో నటించాలి అంటే అంతకుమించి కథ కూడా ఉండాలి. ముఖ్యంగా ఆ కథను అద్భుతమైన కథనంతో ముందుకు తీసుకెళ్లే సత్తా ఉన్న దర్శకులు కూడా కావాలి. అంతేకాదు అలాంటి సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాతలు కూడా ముందుకు రావాలి. ఇవన్నీ జరగడం ఈ కాలంలో అసాధ్యం అనే చెప్పాలి. ఇకపోతే చిరంజీవి కూడా ముగ్గురు మొనగాళ్లు అనే పేరుతో ఒక సినిమా తీయగా దాని పరిస్థితి ఏంటో కూడా మనకు తెలిసిందే.

అయితే ఇటీవల కాలం ఎన్టీఆర్ మాత్రమే జై లవకుశ సినిమాలో మూడు పాత్రలు పోషించి జనాల్ని అలరించాడు. ఈ తరం హీరోలలో ఇలా మూడు పాత్ర లు చేసిన ఘనత ఒక ఎన్టీఆర్కు మాత్రమే దక్కుతుందని చెప్పవచ్చు.

Share.