డిస్కో రాజాకు రిలీజ్‌కు ముందే బిగ్ షాక్‌… !

Google+ Pinterest LinkedIn Tumblr +

మాస్ మ‌హ‌రాజ్ రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాకు రిలీజ్ కు ముందే ఎదురుదెబ్బ తగిలింది. ర‌వితేజ దాదాపుగా యేడాదికి పైగా లాంగ్ గ్యాప్ తీసుకుని న‌టించిన ఈ సినిమా శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమాకు ఏ మాత్రం మంచి థియేట‌ర్లు దొర‌క‌లేదు. దొరికిన‌వి కూడా బీ, సీ గ్రేడ్ థియేట‌ర్లే ఎక్కువుగా ఉన్నాయి. అటు మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లోనూ ఈ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు ఇవ్వలేద‌ని తెలుస్తోంది.

సంక్రాంతి సినిమాలు అయిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల్ని ఇంకా థియేటర్లలో కొనసాగిస్తున్నారు. ఈ రెండు సినిమాలు హిట్ టాక్‌తో ఉండ‌డంతో పాటు ఇంకా మంచి షేర్ రాబ‌డుతుండ‌డంతో వీటిని త‌ప్పించేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేదు. మొత్తంగా చూస్తే ఏపీ, తెలంగాణ‌లో డిస్కో రాజా 280 థియేట‌ర్ల‌లో మాత్ర‌మే రిలీజ్ అవుతోంద‌ట‌. నైజాంలో ఒక్క హైద‌రాబాద్‌లోనే 70 వ‌ర‌కు థియేట‌ర్లు దొర‌క‌గా మిగిలిన తెలంగాణ‌లో అనుకున్న స్థాయిలో థియేట‌ర్లు దొర‌క‌లేదు.

అస‌లు బీ, సీ సెంట‌ర్ల‌లో ఈ సినిమాకు థియేట‌ర్లే దొర‌క‌లేదు. సంక్రాంతి బ‌న్నీ, మ‌హేష్ సినిమాలు ఇంకా స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో చేసేదేం లేదు. ముఖ్యంగా బన్నీ-మహేష్ మధ్య ప్రస్తుతం భారీ ఎత్తున పోటీ నడుస్తున్న నేపథ్యంలో వాళ్లు తమ సినిమాను ఏ ఒక్క థియేటర్ నుంచి తీసేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది వాళ్లకు ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి. కాస్తో కూస్తో ఊర‌ట ఏంటంటే రేప‌టితో చాలా చోట్ల ఎంత మంచివాడ‌వురా, ద‌ర్బార్ సినిమాలు ఎత్తేస్తున్నారు. ఈ థియేట‌ర్లే ర‌వితేజ‌కు దిక్కు కానున్నాయి. ఏదేమైనా అస‌లే అనుకున్న బ‌జ్ లేక‌పోవ‌డం ఓ మైన‌స్ అయితే.. త‌క్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డం ర‌వితేజ‌కు మ‌రో మైన‌స్ కానుంది.

Share.