‘ డిస్కో రాజా ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… ర‌వి మార్కెట్ ఇంత డౌనా…!

Google+ Pinterest LinkedIn Tumblr +

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ న‌టించిన లేటెస్ట్ సినిమా డిస్కో రాజా. క్రియేటివ్ డైరెక్ట‌ర్ విఐ.ఆనంద్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా జనవరి 24న రిలీజ్ అవుతోంది. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ గా, 35 కోట్లతో రూపొందించారని ఇదివరకే తెలిపాము. పలు ప్లాప్స్ కారణంగా డిస్కో రాజా గత సినిమాల తరహాలోనే బిజినెస్ చేయ‌లేదు.

రవితేజ గత సినిమాలు ‘నేల టికెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ లు వరల్డ్ వైడ్ గా రు. 22 కోట్ల బిజినెస్ చేశాయి. డిస్కో రాజా అదే రేంజ్‌లో బిజినెస్ చేసినా ఎక్కువుగా రిట‌ర్న్ బుల్ అడ్వాన్స్ ఒప్పందంపైనే ఈ సినిమాను కొన్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ర‌వితేజ మార్కెట్ చాలా డౌన్ అయ్యింది. ఈ సినిమాతో అయినా మాస్ మ‌హ‌రాజ్ పుంజుకుంటాడేమో ? చూడాలి.

రవితేజ ‘డిస్కో రాజా’ ప్రీ రిలీజ్ బిజినెస్: (రూ.కోట్ల‌లో) :

నైజాం – 6 కోట్లు

సీడెడ్ – 2.8 కోట్లు

గుంటూరు – 1.5 కోట్లు

ఉత్తరాంధ్ర – 2 కోట్లు

తూర్పు గోదావరి – 1.25 కోట్లు

పశ్చిమ గోదావరి – 1.1 కోట్లు

కృష్ణా – 1.25 కోట్లు

నెల్లూరు – 0.65 కోట్లు
————————————-
ఏపీ+తెలంగాణ = 16.55 కోట్లు
————————————-

కర్ణాటక – 1.2 కోట్లు

ఇండియా – 0.5 కోట్లు

ఓవర్సీస్ – 2 కోట్లు

మిగిలిన కంట్రీస్ – 2 కోట్లు

—————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్ – 22.25 కోట్లు
—————————————————–

అక్షరాల 22 కోట్లు షేర్ కలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ ఈ సరి నష్టాల నుంచి రికవర్ అవుతారు. 25 నుంచి 30 కోట్లు షేర్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లాభాలను అందుకుంటారు. డిజాస్టర్స్ ఇచ్చి ఉన్న రవితేజకి ఈ టైంలో ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని చెప్పాలి.

Share.