బాలయ్య అదిరిపోయే ప్లాన్, తారక్ ఒప్పుకుంటాడా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి కుటుంబం అంతా కలిసి ఒక సినిమా చెయ్యాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వాళ్ళు కలిసి ఉంటే చూడాలనేది చాలా మంది అభిప్రాయం. వాళ్ళ సినిమాలు ఒకప్పుడు టాలివుడ్ ని శాసించాయి. ఇప్పుడు వాళ్ళు దూరంగా ఉండటంతో నందమూరి కుటుంబం అనకుండా ఎన్టీఆర్, బాలకృష్ణ అనడం మొదలుపెట్టారు. మెగా కుటుంబం మాత్రం మెగా ఫ్యామిలీ సినిమా అనుకుంటుంది. దీనితో అభిమానుల్లో ఎప్పటి నుంచో ఒకరకమైన నిరాశ అనేది వ్యక్తమవుతుంది.

తాజాగా బాలకృష్ణ దీనిని తొలగించడానికి సిద్దమయ్యారని అంటున్నారు. వాస్తవానికి బాలయ్య 2023 లేదా 24 వరకే సినిమాలు చేస్తారని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆ ప్రచారం నిజమే అంటున్నాయి సిని వర్గాలు. ఈ నేపధ్యంలో బాలకృష్ణ ఒక ప్లాన్ చేసారట. ఒక పౌరాణిక కథను చెయ్యాలని బాలయ్య భావిస్తున్నారట, లేదా ఒక ఫ్యామిలీ సినిమాకు కూడా సిద్దమవుతున్నారట బాలకృష్ణ. ఒక ప్రముఖ దర్శకుడితో ఇదే విషయాన్ని ఆయన చర్చించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ బ్యానర్, బాలకృష్ణ నిర్మాణంలో ఈ సినిమాను భారీగా ప్లాన్ చెయ్యాలని భావిస్తున్నారట. అందరు కలిసి ఉన్నారు మనమే ఇలా ఉన్నాం అనే భావన బాలయ్యలో ఉందని అందుకోసం ఒక మంచి కథను కూడా ఆయన సిద్దం చేయిస్తున్నారని,తనకు సన్నిహితంగా ఉండే ఒక రచయితకు కథను కూడా అప్పగించారనే ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్ళే ఆలోచన ఆయన చేస్తున్నారట. కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నారని, ఎన్టీఆర్ విషయంలోనే స్పష్టత లేదని అంటున్నారు.

Share.