అడవుల్లో తిరుగుతున్న రాజమౌళి, తారక్…?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం రాజమౌళి పడుతున్న కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతు౦ది. ఎక్కడా కూడా ఆయన రాజీ పడకుండా సినిమాను తీసుకువెళ్తున్నారు. బడ్జెట్ విషయంలో కూడా నిర్మాత రాజీపడటం లేదు. దాదాపు 40౦ కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కథలో పట్టున్న నేపధ్యంలో నిర్మాత ఎంత అయినా పెట్టడానికి సిద్దమవుతున్నారు. అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు రాజమౌళి.

ప్రస్తుతం ఈ సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. వచ్చే ఏడాది ఎలా అయినా ఈ సినిమాను విడుదల చెయ్యాలని పట్టుదలగా ఉన్నారు. ప్రస్తుతం రాత్రి సమయాల్లో షూటింగ్ ఎక్కువగా అజరుగుతున్నట్టు సమాచార౦. ఇక ఈ సినిమాలో తారక్ కొన్ని సన్నివేశాల్లో గుండు తో కూడా కనిపించే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక బరువు కూడా భారీగా తగ్గుతూ దర్శకుడికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి కూడా హీరోల ఇద్దరి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇక ఈ సినిమాను అడవుల్లో కూడా చిత్రీకరించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు సెట్స్ మీదే ఎక్కువగా షూటింగ్ జరిగింది. ఇక నుంచి అడవుల్లోకి వెళ్లాలని భావిస్తున్నారట. నల్లమల అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఆ అడవిలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను చూసినట్టు సమాచారం. ప్రస్తుతం మంచు ఉన్న నేపధ్యంలో ఆ మంచులో షూటింగ్ చేయడానికి సిద్దమవుతున్నారట. ప్రస్తుతం ఇద్దరు నల్లమల అడవుల్లో క్యాంప్ వేసే ఆలోచనలో ఉన్నారట.

Share.