సీనియర్ హీరోలలో టాప్ హీరో ఆ హీరో నేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్ల క్రితం ఉన్న హీరోలలో చిరంజీవి,బాలయ్య, వెంకటేష్ , నాగార్జున, అప్పట్లో వీరి నలుగురు ఒకరికి ఒకరు పోటీ పడి సినిమాలు చేసేవారు.ఈ హీరోల సినిమాలకు అప్పట్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చేవి. అయితే ఇప్పుడు కొత్త హీరోలు రావటంతో వారికి కాస్త రిలాక్స్ దొరికింది.అయితే హిట్ టాక్ వస్తే మాత్రం ఈ హీరోల సినిమాలు సైతం బాగానే కలెక్షన్లు సాధిస్తున్నాయి. సీనియర్ హీరోల సినిమాలు ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ అయ్యేవి కావు.. కచ్చితంగా పండుగ టైం లో రిలీజ్ చేసి కలెక్షన్ల వర్షాన్ని కురిపించేవి.

Chiranjeevi, Nagarjuna, Venkatesh to share the dais with Balakrishna for NTR

 

ఇక ఇప్పుడు చిరంజీవి, బాలయ్య ,వెంకటేష్ ,నాగార్జున వీరిలో ఎవరు నెంబర్ వన్ అనే ప్రశ్నకు సమాధానంగా కొంతమంది చిరంజీవిని మరికొంతమంది బాలయ్య అని సమాధానం చెబుతున్నారు. అయితే చిరంజీవి 150 సినిమాతో రీయంట్రీ ఇచ్చాడు..ఆ తర్వాత వాల్తేరు వీరయ్య ఈ రెండు సినిమాలు మంచి కలెక్షన్ రాబట్టాయి కానీ వరుసగా హిట్లు సాధించే విషయంలో చిరంజీవి తడబడుతున్నారు. మరో వైపు బాలయ్య ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఈ మధ్యన సక్సెస్ బాట పడుతున్నాయి. అలాగే 100 కోట్ల కలెక్షన్లు కూడా రాబట్టాయి. సీనియర్ హీరోల్లో నంబర్ వన్ ఎవరనే ప్రశ్నకు ప్రస్తుతం ఇద్దరు హీరోల పేర్లు సమాధానంగా చెప్పాల్సి వస్తోంది.

ఇక నాగార్జున ,వెంకటేష్ వీరిద్దరికీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. అలాగే అభిమానుల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ ఈ మధ్య వారు సినిమాలను అడపాదడపా చేస్తున్నారు.హీరోల సినిమాలు సంచలనాలు సృష్టించే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు. ముందు ముందు సీనియర్ హీరోల సినిమాలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి మరి. అలాగే వీరి సినిమాలపై అభిమానుల్లో ఇప్పటికీ హోప్స్ ఉన్నాయి. ఏదేమైనా వీరు నలుగురు ఎవరికి వారు టాలెంట్ నిరూపించుకుంటున్నారు. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అభిమానులను సైతం అలరిస్తూనే ఉంటారు.

Share.